ETV Bharat / bharat

'శ్రామిక్'రైలులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళా కూలీ

భోపాల్ నుంచి విలాస్​పుర్​ వెళ్తున్న శ్రామిక్​ రైలులో ఓ గర్భిణి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అకస్మాత్తుగా నొప్పులు రావడం వల్ల.. పక్కనున్న మహిళలు సాయమందించి ఆమెకు పురుడు పోశారు. అనంతరం ఆసుపత్రిలో చేర్పించి తల్లి బిడ్డలను ఐసోలేషన్​లో ఉంచారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

Woman migrant delivers baby onboard C'garh-bound Shramik train
శ్రామిక్​రైలులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళా కూలీ
author img

By

Published : May 18, 2020, 5:01 AM IST

వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్​ రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి ఆడ శిశువు జన్మించింది. భోపాల్​ నుంచి విలాస్​పూర్​ వెళ్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని నాగ్​పుర్​ రైల్వే స్టేషన్​ సమీస్తున్న సమయంలో ఈశ్వరి యాదవ్​(23) అనే మహళకు ఉదయం 1.50 గంటలకు పురుటినొప్పులుచ్చాయి. పక్కనే ఉన్న మహిళా ప్రయాణికులు సాయమందించి ఆమెకు పురుడు పోశారు. ఈశ్వరి భర్త రాజేంద్ర తండ్రి అయినందుకు ఎంతో సంతోషించాడు. ఆపద సమయంలో ఆదుకున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపాడు.

"అర్ధరాత్రి నా భార్యకు పురిటి నొప్పులొచ్చాయి. నేను రైల్వే హెల్ప్​లైన్​ నెంబరుకు ఫోన్​ చేశాను. దగ్గర్లోని స్టేషన్​లో రైలు ఆగినప్పుడు వైద్యులు వస్తారని అధికారులు తెలిపారు. ఇక ఏం చెయ్యాలో తెలియక పక్కనున్న మహిళలను సాయం చెయ్యమని అడిగా. వారి రుణం తీర్చుకోలేనిది"

రాజేంద్ర, ఈశ్వరి భర్త

రైలు ఉదయం 4 గంటల ప్రాంతంలో నాగ్​పుర్​ స్టేషన్​కు చేరుకుంది. వెంటనే రైల్వే వైద్య బృందం రాజేశ్వరికి చికిత్స అందించి, మందులు ఇచ్చారు. అనంతరం తిరిగి ప్రయాణం మొదలు పెట్టగా.. విలాస్​పుర్​ చేరుకోగానే ఛత్తీస్​గఢ్​ ఇన్​స్టిట్యూట్​ ఆప్​ మెడికల్​ సైన్స్​​(సీఐఎంఎస్​)కు తల్లి, బిడ్డను ఆంబులెన్సులో తరలించారు అధికారులు. మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటిల్​ నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఇద్దరినీ ఐసోలేషన్​లో ఉంచారు.

నీళ్లే ఆహారం...

ఛత్తీస్​గఢ్​ ముంగేలిలోని ధర్మపుర గ్రామంలో రాజేంద్ర దంపతులు నివాసం ఉంటున్నారు. మార్చిలో ఓ నిర్మాణ పనుల నిమిత్తం కుటుంబంతో కలిసి భోపాల్​ వెళ్లారు. అయితే, పని మొదలైన నాలుగు రోజుల్లోనే లాక్​డౌన్​ ప్రకటించింది ప్రభుత్వం. ఈ రెండు నెలలు తినడానికి తిండిలేక ఎంతో ఇబ్బంది పడినట్లు రాజేంద్ర తెలిపాడు. కొన్నిసార్లు నీళ్లతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రసవం జరిగిందిలా...

భార్యకు ప్రసవ సమయం దగ్గర పడుతుండటం వల్ల స్వస్థలం వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. చివరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ద్వారా ఇంటికి ప్రయాణమవుతున్న సమయంలో.. ఈశ్వరి పండటి బిడ్డకు జన్మించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.