ETV Bharat / bharat

భర్త మొబైల్​ తీసుకున్నాడని పిల్లల్ని చంపేసిన భార్య! - Woman Commits Suicide with her Children After Husband Snatches the Mobile

చరవాణి వాడకానికి బానిసైన ఓ మహిళ నవమాసాలు మోసిన పిల్లల్నే పొట్టనబెట్టుకుంది. భర్త తన మొబైల్​ తీసుకున్నాడన్న కారణంతో వారిని చంపి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక మైసూర్​లో ఈ విషాదం జరిగింది.

Woman killed two Children
భర్త మొబైల్​ తీసుకున్నాడని పిల్లల్ని చంపేసిన భార్య
author img

By

Published : Oct 18, 2020, 11:58 AM IST

కర్ణాటక మైసూర్​లో పిల్లలను చంపి ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ కర్కశ తల్లి. చరవాణిని భర్త తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ముజమిల్​, సుఫియా భార్యాభర్తలు. వీరిద్దరికి మునేజా(3), ఇనయా(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముజమిల్ మైసూర్​లోని​ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా రోజులుగా సుఫియా​ చరవాణి వాడకానికి బానిసైంది. అయితే ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా ఆమె ఫోన్​ను భర్త బలవంతంగా తీసుకొని ఉద్యోగానికి వెళ్లగా.. మనస్తాపానికి గురైన సుఫియా తన ఇద్దరు పిల్లలను హత్యచేసింది. అనంతరం ఇంట్లోని ఫ్యాన్​కు ఉరివేసుకొని ప్రాణాలు విడిచింది.

మైసూర్​లోని ఉదయగిరి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సుఫియా భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.