అత్తారింటి నుంచి ఓ వివాహితను బయటకు గెంటివేస్తే, ఆమె ఆశ్రయం పొందిన ప్రదేశం నుంచే భర్త, అత్తమామలపై క్రిమినల్ కేసులు దాఖలు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం.. కీలక తీర్పు వెలువరించింది. ఓ వివాహిత వరకట్నం, గృహహింస కేసులను ఎక్కడ (ఏ ప్రదేశం) నుంచి దాఖలు చేయాలన్న విషయంపై స్పష్టతనిచ్చింది.
ఓ స్త్రీ వివాహానికి ముందు, తరువాత ఏఏ ప్రాంతాల్లో నివసించిందో, ప్రస్తుతం ఏ ప్రదేశంలో ఆశ్రయం పొందుతోందో, ఆయా ప్రాదేశిక అధికార పరిధుల్లో వివాహ సంబంధ కేసులు దాఖలు చేయవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రూపాలీదేవి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.