ETV Bharat / bharat

'ఈ పామే నన్ను కాటేసింది డాక్టర్​ గారూ!' - కర్ణాటకలో తనను కాటేసిన పామును ఆసుపత్రికి తీసుకెళ్లిన మహిళా రైతు

ఓ మహిళా రైతు తనను కాటేసిన పామును తీసుకొని నేరుగా ఆసుపత్రికి వెళ్లి అందరినీ కంగారు పెట్టిన ఘటన కర్ణాటక బీదర్​లో జరిగింది. మొదట పామును చూసి భయపడిన వైద్యులు.. తరువాత తేరుకుని బాధితురాలికి వైద్యం అందించారు.

woman biten by snake carried snake to hospital
కర్ణాటకలో తనను కాటేసిన పామును ఆసుపత్రికి తీసుకెళ్లిన మహిళా రైతు
author img

By

Published : Jun 13, 2020, 10:06 AM IST

సాధారణంగా ఎవరైనా పాము కాటేస్తే ఏం చేస్తారు? భయంతో పరుగుపరుగున ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటారు.. కదా! కానీ ఓ మహిళా రైతు.. తనను కాటేసిన పామును చంపేసి, దానిని నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లి... వైద్యం చేయమని అడిగింది. ఈ ఘటన కర్ణాటక బీదర్​లో జరిగింది.

woman biten by snake carried snake to hospital
పాము కాటుకు గురైన మహిళా రైతు

బీదర్ జిల్లా బాల్కి తాలూకాలోని తల్వాడ్​ (ఎం) గ్రామానికి చెందిన షీలాబాయి అనే మహిళా రైతు.. పొలం పనులు చేసుకుంటూ ఉండగా పాము కరిచింది. దీనితో కంగారుపడిన ఆమె పక్కనున్న ఓ రాయిని తీసుకుని పామును చంపేసింది. తరువాత దానిని మంటల్లో వేసి కాల్చింది. తరువాత ఏమనుకుందో ఏమో.. ఆ పామును మంటల్లో నుంచి తీసి.. నేరుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. 'ఈ పామే నన్ను కాటేసింది' అని వైద్యులకు చూపించింది. మొదట కంగారుపడిన వైద్యులు.. తరువాత ఆమెకు వైద్యం అందించారు.

మహిళా రైతుని కాటేసి మరణించిన పాము

ఇదీ చూడండి: 'ఆకలైతేనే వేటాడతా'.. పులికి సమీపంగా నెమలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.