కరోనా భయంతో సాయమందించే వారే కరవై.. అయినవారికి సరైన అంతిమయాత్ర కూడా చేయలేని దుస్థితిలో ఉన్నారు కొంతమంది. ఇటీవల కర్ణాటకలో ఓ వృద్ధుడు మరణించగా.. కొవిడ్ వల్లే మృతిచెందాడని అనుమానించి ఏ ఒక్కరూ సాయం చేయడానికి రాలేదు. ఇక చేసేదేమీ లేక వర్షంలో సైకిల్‌పైనే మృతదేహాన్ని తరలించారు బాధిత కుటుంబ సభ్యులు.
-
ಬೆಳಗಾವಿಯ ಕಿತ್ತೂರಿನ 70 ವರ್ಷದ ವೃದ್ಧನ ಶವವನ್ನು ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ಮಳೆಯಲ್ಲಿ ನೆನೆಯುತ್ತಾ ಸೈಕಲ್ ನಲ್ಲಿ ಸಾಗಿಸಿದ್ದಾರೆ
— DK Shivakumar (@DKShivakumar) August 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
ಸಿಎಂ @BSYBJP ಅವರೇ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ಮ ಸರ್ಕಾರ? ಅವರಿಗೆ ಏಕೆ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಒದಗಿಸಲಿಲ್ಲ?
ಈ ಅಸಮರ್ಥ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮಾನವೀಯತೆ ಇಲ್ಲವಾಗಿದ್ದು, ಪಿಡುಗು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನಿಭಾಯಿಸಲು ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಿಫಲವಾಗಿದೆ pic.twitter.com/dZxCj9sO9P
">ಬೆಳಗಾವಿಯ ಕಿತ್ತೂರಿನ 70 ವರ್ಷದ ವೃದ್ಧನ ಶವವನ್ನು ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ಮಳೆಯಲ್ಲಿ ನೆನೆಯುತ್ತಾ ಸೈಕಲ್ ನಲ್ಲಿ ಸಾಗಿಸಿದ್ದಾರೆ
— DK Shivakumar (@DKShivakumar) August 17, 2020
ಸಿಎಂ @BSYBJP ಅವರೇ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ಮ ಸರ್ಕಾರ? ಅವರಿಗೆ ಏಕೆ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಒದಗಿಸಲಿಲ್ಲ?
ಈ ಅಸಮರ್ಥ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮಾನವೀಯತೆ ಇಲ್ಲವಾಗಿದ್ದು, ಪಿಡುಗು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನಿಭಾಯಿಸಲು ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಿಫಲವಾಗಿದೆ pic.twitter.com/dZxCj9sO9Pಬೆಳಗಾವಿಯ ಕಿತ್ತೂರಿನ 70 ವರ್ಷದ ವೃದ್ಧನ ಶವವನ್ನು ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ಮಳೆಯಲ್ಲಿ ನೆನೆಯುತ್ತಾ ಸೈಕಲ್ ನಲ್ಲಿ ಸಾಗಿಸಿದ್ದಾರೆ
— DK Shivakumar (@DKShivakumar) August 17, 2020
ಸಿಎಂ @BSYBJP ಅವರೇ ಎಲ್ಲಿದೆ ನಿಮ್ಮ ಸರ್ಕಾರ? ಅವರಿಗೆ ಏಕೆ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಒದಗಿಸಲಿಲ್ಲ?
ಈ ಅಸಮರ್ಥ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮಾನವೀಯತೆ ಇಲ್ಲವಾಗಿದ್ದು, ಪಿಡುಗು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನಿಭಾಯಿಸಲು ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಿಫಲವಾಗಿದೆ pic.twitter.com/dZxCj9sO9P
ఇదీ జరిగింది..
బెళగావిలోని కిట్టూర్లో ఓ 70 ఏళ్ల వ్యక్తి అనారోగ్యం బారినపడ్డాడు. కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ వైద్యుడికి చూపించగా.. కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి, ఆస్పత్రిలో చేర్పించమని సూచించారు. ఇంతలోనే అతడు మరణించాడు. ఎడతెరపిలేని వర్షాల కారణంగా మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టడం ఆ కుటుంబానికి కష్టమైంది. అంబులెన్స్ సాయం కోసం అత్యవసర నంబర్‌కు డయల్ చేయగా ఎలాంటి స్పందనా లేదు. కరోనా భయంతో స్థానికులెవరూ ముందుకురాలేదు. ఇక చేసేదేమీలేక సైకిల్‌పైనే మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించారు.
'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే'
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం ఎక్కడుందని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అంబులెన్స్ సౌకర్యం ఎందుకు అందలేదని నిలదీశారు. కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
ఇదీ చదవండి: ఆరేళ్ల టీచర్ ఆన్లైన్ పాఠాలు సూపర్