ETV Bharat / bharat

ఎన్నికల్లో 'కరోనా ట్రెండ్​'కు ఆ రాష్ట్రం నుంచే నాంది! - rjd

కరోనా... ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న భయంకర మహమ్మారి. అత్యంత పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థలనూ గడగడలాడిస్తున్న సూక్ష్మజీవి. దీని దెబ్బకు అన్ని రంగాలు కుదేలైపోవడమే కాదు... ఆయా రంగాల్లో మార్పులు అనివార్యమయ్యాయి. భారీ ఎత్తున జనసమూహాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏర్పడింది. మరి భారత్​లో ఎన్నికల విషయాన్నికొచ్చే సరికి ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్న తలెత్తుతోంది. భారీ స్థాయిలో ప్రచారాలు ఉండకపోవచ్చనే విషయం స్పష్టమవుతోంది.

bihar polls
బిహార్​ ఎన్నికలు
author img

By

Published : Jun 21, 2020, 12:10 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలంటే మామూలు విషయం కాదు. లక్షల మందితో ప్రచార సభలు, కిలోమీటర్ల మేర ర్యాలీలు, భారీ జనసందోహం మధ్య రోడ్​ షోలు... ఈ తతంగమంతా ఓ పండగలా జరుగుతుంది. ప్రజల సమక్షంలో నేతల హామీలు, ప్రతిపక్షాలపై విమర్శలు- ప్రతివిమర్శలు జోరుగా సాగుతుంటాయి.

కానీ, కరోనా వైరస్ ప్రతాపం వల్ల వైభవంగా జరిగే ఈ కార్యక్రమాలు మసకబారే అవకాశం ఉంది. నాయకులు వాగ్బాణాలు సంధించుకున్నా.. అవి ఎక్కువగా ఆన్​లైన్​కే పరిమితం కానున్నాయి. భారీ సభలు లేకుండా సామాజిక మాధ్యమాల్లోనే ప్రచారం నిర్వహించే పరిస్థితులు తలెత్తుతున్నాయి.

ఇప్పటికే షురూ

ఈ సంవత్సరం బిహార్​ శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. వచ్చే ఏడాది తమిళనాడు, బంగాల్ రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఆన్​లైన్ ప్రచారంవైపే మొగ్గుచూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

బిహార్​లోని అధికార పార్టీ జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) ఇప్పటికే ఈ తరహా ప్రచారానికి సిద్ధమైంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆన్​లైన్​లోనే ప్రచారం నిర్వహించే విధంగా కసరత్తులు చేస్తోంది. సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్​బుక్ పేజీలను తయారు చేసి పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా ఉపయోగించుకోవాలని కార్యకర్తలను కోరారు.

యువతపై దృష్టి

యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లోనే సమయం గడుపుతున్న నేపథ్యంలో ఈ వేదికను ఉపయోగించుకునే విధంగా పార్టీ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది.

"18-24 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకుల్లో 70 శాతం మంది వాట్సాప్, ఫేస్​బుక్ మాధ్యమాల్లో క్రియాశీలం​గా ఉంటున్నారు. అందుకే ఆ వేదికల్ని సద్వినియోగం చేసుకోవాలి."

-సంజయ్ కుమార్ ఝా, జేడీయూ జాతీయ కార్యదర్శి

తెలుగుదేశం ఇప్పటికే ఈ తరహా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. వేలాది మందితో కలిసి ఆన్​లైన్​లోనే పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించి ఔరా అనిపించింది.

లాభాలెంతో నష్టాలూ అంతే!

సాధారణ ప్రచారాలతో పోలిస్తే ఆన్​లైన్ ప్రచారం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఎన్నికల వేళ నిర్వహించే ఒక్క భారీ సభకు అయ్యే వ్యయంతో చాలా వరకు ఆన్​లైన్ ప్రచారాన్ని పూర్తి చేయవచ్చు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రాజకీయాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. నాయకులు తాము చెప్పాలనుకున్న విషయాన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రజలకు సూటిగా చెబుతున్నారు.

అయితే, ఈ ప్రచారంతో పార్టీలకు లాభం ఎంత ఉందో, నష్టం కూడా అదే స్థాయి​లో ఉండొచ్చనేది నిపుణుల మాట. కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించడం వల్ల అత్యంత ముఖ్యంగా భావించే వృద్ధుల ఓట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిరక్షరాస్యుల విషయంలోనూ ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 'ఒకే సరిహద్దు- ఒకే సైన్యం విధానం మనకూ అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.