దేశంలో కరోనా కేసుల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. కొత్తగా 55,838 కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 77 లక్షల 6వేల 946కు చేరింది. మరో 702 మంది మహమ్మారికి బలయ్యారు.
మొత్తం కేసులు: 77,06,946
మొత్తం మరణాలు: 1,16,616
కోలుకున్నవారు: 68,74,518
దేశంలో రికవరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా 79,415 మంది మహమ్మారిని జయించగా.. మొత్తం రికవరీల సంఖ్య 68,74,518 చేరింది. ఫలితంగా రికవరీ రేటు 89.20శాతానికి పెరిగంది. మరణాల రేటు 1.51 శాతానికి తగ్గింది.
ఒక్కరోజులో 14,69,984 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో కొవిడ్ నిర్ధరణ పరీక్షల సంఖ్య 9 కోట్ల 86 లక్షల 70 వేలు దాటింది.
ఇదీ చూడండి: 'సీబీఐ'కి అనుమతి ఉపసంహరించిన ఠాక్రే సర్కార్