దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు 36 వేల 469 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 79 లక్షల 50 వేలకు చేరువైంది. మరో 488 మంది మరణించారు.

గత 3 నెలల వ్యవధిలో ఇవే తక్కువ కేసులు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 90.62 శాతానికి చేరింది. మరణాల రేటు 1.50 శాతానికి పడిపోయింది.

భారీ సంఖ్యలో టెస్టులు..
సోమవారం రోజు 9 లక్షల58 వేల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది ఐసీఎంఆర్. మొత్తం టెస్టుల సంఖ్య 10 కోట్ల 44 లక్షలు దాటింది.