కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి భద్రత తగ్గింపు వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టంచేసింది భాజపా. ఎస్పీజీ భద్రత తొలగింపుపై హోంశాఖ అధికారులే నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభలో చెప్పారు ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా. కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ... గాంధీల భద్రతలో మార్పుపై అభ్యంతరం వ్యక్తంచేయగా ఈమేరకు స్పందించారు నడ్డా.
లోక్‌సభ స్పీకర్ హెచ్చరిక..
లోక్‌సభలో అజెండాలో లేని అంశాలపై చర్చ చేపట్టాలని కొంతమంది సభ్యులు పట్టుబట్టగా.. స్పీకర్ ఓంబిర్లా అసహనం వ్యక్తంచేశారు. తన అనుమతి లేకుండా ఎవరూ సీట్ల నుంచి లేవకూడదని సూచించారు. మంగళవారం కూడా సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు స్పీకర్.
ఇదీ చూడండి: నేడు ప్రధానితో శరద్‌పవార్ భేటీ... కారణం ఇదే!