కాంగ్రెస్ అధినేత పోటీ చేసే రెండో స్థానంపై జరుగుతున్న చర్చ... ఇప్పుడు మరింత విస్తరించింది. తెరపైకి అనూహ్యంగా ప్రధాని నరేంద్రమోదీ వచ్చారు.
నరేంద్రమోదీ ప్రస్తుతం వారణాసి ఎంపీ. మరోమారు అక్కడి నుంచి పోటీ చేయడం ఖాయం. రెండో స్థానం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరం. 2014లో వారణాసితోపాటు గుజరాత్ వడోదర నుంచి పోటీ చేశారు మోదీ. మరోమారు అదే జరగొచ్చని తొలుత వార్తలు వచ్చాయి. ఇప్పుడు దక్షిణ భారతం మాట వినిపిస్తోంది. కర్ణాటక నుంచి మోదీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తారని భాజపా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
దక్షిణ బెంగళూరే ఎందుకు?
దక్షిణ బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గం 1991 నుంచి భాజపాకు కంచుకోట. 1996 నుంచి దివంగత కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. హెగ్డే మరణాంతరం దక్షిణ బెంగళూరు నుంచి మోదీ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. హెగ్డే పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకునేందుకే మోదీ ఈ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారన్నది కమలనాథుల మాట.
మోదీ దక్షిణ బెంగళూరు నుంచి పోటీ చేస్తే... ప్రత్యర్థిగా కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
బలోపేతమే వ్యూహంగా...
ఇటీవల దేశ రాజకీయాల్లో ఉత్తర, దక్షిణ భారత ప్రాతినిధ్యంపై విస్తృత చర్చ సాగుతోంది. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ కాంగ్రెస్‌కు ఇప్పటికే కొంతమేర పట్టుంది. ఉత్తరాది స్థాయిలో దక్షిణాదిన ఎదగాలన్నది భాజపా వ్యూహం. అందుకే... నేరుగా అగ్రనేతల్ని రంగంలోకి దించితేనే అనుకున్న లక్ష్యం సాధించవచ్చన్నది ఇరు పార్టీల ఆలోచన.
ఇవీచూడండి: