రాజస్థాన్‌లో ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రసంగించారు సీఎం అశోక్ గహ్లోత్. జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్ హోటల్లోని కాంగ్రెస్ శాసనసభ పార్టీ(సీఎల్పీ) సమావేశం నిర్వహించిన ఆయన.. ఐక్యంగా కలిసి పోరాడుదామని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. పరిస్థితులు చక్కబడేవరకూ ఎన్ని రోజులైనా సరే ఎమ్మెల్యేలు హోటల్లోనే ఉండాలన్నారు గహ్లోత్.
తమ కార్యకలాపాలను కూడా హోటల్ నుంచే నిర్వహించాలని పార్టీ సభ్యులను కోరారు సీఎం. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈద్, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కూడా అక్కడే చేసుకోవాలన్నారు. ఇందుకోసం తమ కుటుంబ సభ్యులనూ అక్కడికే పిలిపించుకోవాలని చెప్పారు.
అయితే ఇప్పటివరకు సుమారు 70 మంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, బంధువులు, పిల్లలు ఆ హోటల్‌ను సందర్శించారు. మరో 24 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం అక్కడే ఉన్నారు.
ఇదీ చదవండి: ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు