ETV Bharat / bharat

'మాజీ డీజీపీకి టికెట్​ ఇస్తే ఫడణవీస్​నే ప్రజలు ప్రశ్నిస్తారు' - Maharashtra Congress questioned on Pandey JD(U) ticket

బిహార్​ మాజీ డీజీపీ గుప్తేశ్వర్​ పాండేను జేడీ(యూ)లో చేర్చుకోవడం బాధాకరమని మహారాష్ట్ర కాంగ్రెస్​ అభిప్రాయపడింది. ఆయనకు టికెట్ ఇచ్చే విషయాన్ని ఆ రాష్ట్ర భాజపా ఇన్​ఛార్జి దేవేంద్ర ఫడణవీస్​ వ్యతిరేకించకపోతే ప్రజలు ఆయనను తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తారని తెలిపింది.

Will be painful if JD(U) gives ticket to ex-Bihar DGP: Congress
మాజీ డీజీపీకి జేడీ(యూ) టికెట్​ ఇవ్వడం బాధాకరం
author img

By

Published : Sep 28, 2020, 3:05 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఆ రాష్ట్ర మాజీ డీజీపీ గుప్తేశ్వర్​ పాండేకు జనతా దళ్​(యూనైటెడ్​) పార్టీ.. అసెంబ్లీ టికెట్ ఇస్తే చాలా బాధాకరమని మహారాష్ట్ర కాంగ్రెస్​ అభిప్రాయపడింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​ భాజపా ఇన్​ఛార్జిగా ఉన్న సమయంలోనే పాండే.. ముంబయి పోలీసులను అవమానించారని గుర్తుచేసింది.

మాజీ డీజీపీ పాండేకు భాజపా మిత్రపక్షాలు పార్టీలో చోటు​ ఇవ్వడం దురదృష్టకరమని మహారాష్ట్ర కాంగ్రెస్​ అధికార ప్రతినధి సచిన్​ సావంత్​ అన్నారు. ఆయనకు టికెట్ ఇచ్చే అంశాన్ని భాజపా వ్యతిరేకంచకపోతే.. ఫడణవీస్​నే ప్రజలు ప్రశ్నిస్తారన్నారు. మూడు దశల్లో(అక్టోబర్ 28, నవంబర్​ 3, 7) జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా సీనియర్​ నేత ఫడణవీస్.. పార్టీ​ ఇన్​ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ ఆహ్వానంతో.. ఇటీవలే జేడీ(యూ)లో చేరారు పాండే. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది​.

స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్​ఎస్​)కు ముందు సుశాంత్​ కేసును దర్యాప్తు చేసిన పాండే.. ముంబయి పోలీసులు, మునిసిపల్​ అధికారులు.. కేసులో సహకరించలేదని ఆరోపించారు.

ఇదీ చదవండి: ఎన్​కౌంటర్​ చేయొద్దంటూ ప్లకార్డుతో లొంగిపోయిన గ్యాంగ్​స్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.