భాజపా అధ్యక్షుడు అమిత్ షా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఈనెల 30న సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికైన భాజపా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి, పార్టీ శాసనాసభాపక్షనేతను ఎన్నుకున్న తర్వాత వీరి భేటీ జరగనున్నట్లు సమాచారం.
ఈ సమావేశంలో పాలనను చెరో రెండున్నరేళ్లు చొప్పున పంచుకోవాలన్న అంశంపై చర్చ జరిగే అవకాశముంది. ఈనెల 30 న భాజపా శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారని భాజపా ఎమ్మెల్సీ గిరీశ్ వ్యాస్ వెల్లడించారు.
ఈ కార్యక్రమం తర్వాత అమిత్ షా, ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావచ్చని ఆయన తెలిపారు. పాలనలో చెరిసగం అనే విషయాన్ని ఎన్నికలకు ముందే అమిత్ షా, ఫడణవీస్‌కు తెలిపామని ఫలితాలు వెల్లడైన తర్వాత ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.