సమాజంలో ఆర్థిక విషయాలు మానవతా విలువల్ని ఎంతగా దిగజార్చుతున్నాయో తెలిపేందుకు ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కుమారుడికి ఉద్యోగం, లేదా తనకు పింఛను వస్తుందన్న ఆశతో భర్తనే అత్యంత కిరాతకంగా చంపిందో మహిళ.
అహ్మదానగర్లో నివాసముండే తేజ్‌రామ్.. సీహీ బబుపుర్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్యూన్. 2020 జనవరిలో పదవీ విరమణ పొందాల్సి ఉంది. తేజ్రామ్కు ఇద్దరు కుమారులు జగ్వీర్, కపిల్. భార్య పేరు మైమవతి.
మైమవతి అత్యంత అమానుషంగా ఆలోచించింది. పదవీ విరమణకు ముందే భర్త చనిపోతే ఆ ఉద్యోగం తన కుమారుడికి వస్తుందని ఆశించింది. లేకపోతే తనకు పింఛను వస్తుందని భావించింది. అనుకున్నదే తడువుగా కొడుకు కపిల్‌తో కలిసి భర్తను ముక్కలు ముక్కలుగా నరికింది. శవాన్ని గోనె సంచిలో మూటగట్టి ఊరిబయట చెత్తకుప్పలో పడేసింది.
శనివారం రాత్రి నుంచి తేజ్‌పాల్ అదృశ్యమవగా... బీబీనగర్ ఠాణాలో కేసు నమోదైంది. అనుమానం వచ్చిన పోలీసులు... మైమవతి, కపిల్‌ను తమదైన శైలిలో ప్రశ్నించారు. చివరకు నిందితులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు.
ఇదీ చూడండి: నాలుగేళ్ల బిడ్డను దొంగ నుంచి కాపాడుకున్న అమ్మ