మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల పర్వం కొనసాగుతోంది. రోజూ ఏదో ఒక అంశంలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు రాహుల్. కరోనా వైరస్ నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రతి విషయంలో సర్కారు విఫలమైందంటూ ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా మధ్యతరగతి ప్రజలకు రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు రాహుల్. పెద్ద పెద్ద వ్యాపారులకే పన్నులు ఎందుకు మాఫీ చేస్తున్నారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం 'సూటు బూటు సర్కార్' అంటూ ఎద్దేవా చేశారు.
-
1450000000000 tax cut benefit given to big businesses.
— Rahul Gandhi (@RahulGandhi) August 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
But no interest waiver on loans for middle class.
1450000000000 रुपय की टैक्स-छूट का फ़ायदा बड़े व्यवसायों को दिया गया।
लेकिन मध्यम वर्ग को लोन पर ब्याज-माफ़ी तक नहीं।
क्योंकि ये है #SuitBootKiSarkar pic.twitter.com/eFMrgtKrG1
">1450000000000 tax cut benefit given to big businesses.
— Rahul Gandhi (@RahulGandhi) August 27, 2020
But no interest waiver on loans for middle class.
1450000000000 रुपय की टैक्स-छूट का फ़ायदा बड़े व्यवसायों को दिया गया।
लेकिन मध्यम वर्ग को लोन पर ब्याज-माफ़ी तक नहीं।
क्योंकि ये है #SuitBootKiSarkar pic.twitter.com/eFMrgtKrG11450000000000 tax cut benefit given to big businesses.
— Rahul Gandhi (@RahulGandhi) August 27, 2020
But no interest waiver on loans for middle class.
1450000000000 रुपय की टैक्स-छूट का फ़ायदा बड़े व्यवसायों को दिया गया।
लेकिन मध्यम वर्ग को लोन पर ब्याज-माफ़ी तक नहीं।
क्योंकि ये है #SuitBootKiSarkar pic.twitter.com/eFMrgtKrG1
"పెద్ద వ్యాపారాలకు రూ.1.45 లక్షల కోట్ల పన్ను ప్రయోజనాలు కల్పించారు. కానీ మధ్యతరగతి ప్రజలకు రుణాలపై వడ్డీపై మినహాయింపు మాత్రం లేదు. ఎందుకంటే ఇది సూటు బూటు సర్కార్."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ మాఫీకి సంబంధించి కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిన వార్తా కథనాలను ట్వీట్‌కు జతచేశారు రాహుల్.
కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు వెనక దాక్కుంటోందని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. రుణాలు, ఈఎంఐలపై మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై స్పష్టమైన వైఖరి చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు వారం రోజుల గడువు ఇచ్చింది.
ఇదీ చదవండి- కరోనా వ్యాక్సిన్‌పై ముందుచూపు లేదు: రాహుల్