ETV Bharat / bharat

'దేశ ఖ్యాతి పెరుగుతుంటే కాంగ్రెస్​కు బాధ ఎందుకో?' - ట్రంప్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత​ పర్యటనపై కాంగ్రెస్​ వైఖరిని తప్పుబట్టింది భాజపా. దేశ ఖ్యాతిని గర్వించే స్థాయికి చేర్చుతున్నప్పుడు అసంతృప్తి చెందాల్సిన అవసరం ఏంటని భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా ప్రశ్నించారు.

BJP
భాజపా
author img

By

Published : Feb 22, 2020, 3:46 PM IST

Updated : Mar 2, 2020, 4:40 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత పర్యటనపై కాంగ్రెస్​ తీరును తప్పుబట్టింది భాజపా. దేశ ఖ్యాతిని ప్రపంచపటంపై గర్వించదగ్గ స్థాయిలో ఉంచుతున్నప్పుడు ఎందుకు అసంతృప్తి చెందుతున్నారని ప్రశ్నించింది. భాజపా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబిత్​ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి

కాంగ్రెస్​ పార్టీకి నా హృదయపూర్వకమైన సలహా ఏంటంటే... ఏ దేశ చరిత్రలోనైనా చాలా అరుదుగా అవకాశాలు వస్తుంటాయి. అలాంటి సమయంలో దేశంలోని ఐకమత్యాన్ని చాటాలి కానీ విభజన భావాన్ని కాదు. ఈ మట్టి భరతమాత పుట్టినిల్లు. ఈ దేశం కాంగ్రెస్​ పార్టీకి చెందినదో.. భాజపాకు చెందినదో కాదు. ఓ భారతీయుడిగా మా పార్టీ ముఖ్య సిద్ధాంతం ఒకటే.. దేశం ముందు, తర్వాత పార్టీ, చివరలో మనం.

-సంబిత్​ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి

భారత్​- అమెరికా సత్సంబంధాల మరింత బలంగా మారేందుకు ట్రంప్​ పర్యటన కీలకంగా మారనుందని పేర్కొన్నారు పాత్రా . బేరసారాలడటంలో భారత్​ దిట్ట అని ట్రంప్​ అనేక సార్లు చెప్పినట్లు పాత్రా గుర్తుచేశారు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్​ కంగారు పడాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

Last Updated : Mar 2, 2020, 4:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.