ETV Bharat / bharat

'అలా చెప్పి కరోనా యోధులను అవమానిస్తారా?' - కరోనా యోధుల మరణాలు సమాచారం

కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచి ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల సమాచారం లేదన్న కేంద్రంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. ఈ విధంగా కరోనా యోధులను అవమానించడం ఎందుకని ప్రశ్నించారు.

Why insult corona warriors: Rahul on govt's 'no data on deaths of healthcare worker' RS reply
'కరోనా యోధులను అవమానించడం ఎందుకు?'
author img

By

Published : Sep 18, 2020, 2:10 PM IST

కొవిడ్‌పై పోరాటంలో ముందు వరుసలో నిలిచి మరణించిన ఆరోగ్య కార్యకర్తల సమాచారం తమ దగ్గరలేదంటూ కేంద్రం చెప్పడం దారుణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సరికాదని.. అది కొవిడ్ యోధులను అవమానించడమే అవుతుందని ధ్వజమెత్తారు.

కరోనా కారణంగా మరణించిన.. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తల వివరాలు తెలపాలంటూ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినిచౌబే. ఆ వివరాలు కేంద్రం దగ్గర ఉండవని, ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశమని సమాధానం ఇచ్చారు. ఆ వార్తను ట్యాగ్ చేస్తూ.. 'సమాచారం లేని మోదీ సర్కారు' అనే ట్యాగ్​తో అమెరికా నుంచి రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. దీపాలు వెలిగించడం, కంచాలను కొట్టి శబ్ధం చేయడం కంటే... కరోనా యోధుల రక్షణే చాలా ముఖ్యమని అన్నారు.

ఇదీ చూడండి:- 'మోదీ హామీలు.. గాలిలో మేడలు కట్టడం ఒకటే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.