ETV Bharat / bharat

పాక్​ కవ్వింపులకు అంతం లేదా..? కట్టడి చేయలేమా...? - 2013 తర్వాత మారిన పరిస్థితులు

భారత్​-పాకిస్థాన్​... ఉప్పు నిప్పులా కొట్లాడుకునే దేశాలు. రెండు దేశాల మధ్య ఎప్పుడూ ఉద్రిక్తకర పరిస్థితులు. సంబంధాలూ అంతంతమాత్రమే. ఇటీవల పరిణామాలతో పరిస్థితులు ఇంకా చేయిదాటిపోయాయి. ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయలేం. వీటికి తోడు పాక్​ నుంచి వరుస కాల్పుల విరమణ ఉల్లంఘనలు. అమరులవుతున్న ఎందరో సైనికులు, పౌరులు. ప్రశాంతత, శాంతి సామరస్యం కోసం ఈ కాల్పుల విరమణను అడ్డుకోలేమా..? అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయనేదానిపై విశ్రాంత​ లెఫ్టినెంట్​ జనరల్​ డీఎస్​ హుడా రాసిన ప్రత్యేక వ్యాసం.

పాక్​ కవ్వింపులకు అంతం లేదా..? కట్టడి చేయలేమా...?
author img

By

Published : Oct 23, 2019, 4:51 PM IST

అక్టోబర్​ 20... నియంత్రణ రేఖ వెంట రక్తపాతం జరిగిన రోజు. తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్​పై భారత్​ ప్రతీకారం తీర్చుకుంది. ఎలాంటి కవ్వింపు లేకుండా ఆ దేశ సైన్యం జరుపుతున్న కాల్పులకు దిమ్మ తిరిగిపోయేలా బదులిచ్చింది. శతఘ్నిదళం పాకిస్థానీ స్థావరాలు, ఉగ్రవాద​ లాంచ్​ ప్యాడ్లు, గన్​ పొజిషిన్​లే లక్ష్యంగా విరుచుకుపడింది. మొత్తం 9 మంది సైనికులు, పౌరులు చనిపోయినట్లు నిర్ధరణ అయింది. అయితే.. భారత్​, పాకిస్థాన్​ ప్రత్యారోపణలు గుప్పించుకున్నాయి. ప్రత్యర్థి దేశానికే ఎక్కువ నష్టం వాటిల్లిందని పరస్పరం వాదించుకున్నాయి.

ఇదీ చూడండి: భారత సైన్యం ప్రతీకారం- ఐదుగురు పాక్ జవాన్లు హతం!

దీనిపై భారత సైన్యాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ ప్రకటన కూడా చేశారు. ఆరు నుంచి పది మంది పాక్​ సైనికులు మరణించారని.. మరో మూడు ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసినట్లు స్పష్టం చేశారు. అయితే... వెంటనే బదులిచ్చిన పాక్​ సైనిక మీడియా భారత వాదనల్ని తోసిపుచ్చింది. ఎప్పట్లాగే బుకాయించి... కట్టుకథలు అల్లింది. 9 మంది భారత భద్రతా సిబ్బందే ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. భారత్​కే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది.

వీడియోలు సృష్టించి తప్పుదోవ...

భారత్​, పాకిస్థాన్​ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన అనంతరం ప్రతిసారీ ఇలాంటి మాటల యుద్ధమే జరుగుతుంది. సైనికులను తరిమికొట్టి, శిబిరాల్ని ధ్వంసం చేసినట్టుండే నకిలీ వీడియోలు ట్విట్టర్లో దర్శనమిస్తాయి. కానీ ఇలాంటివి... నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న సంఘర్షణకు సంబంధించిన వాస్తవాలను ఏమాత్రం ప్రతిబింబించవు.

అలా మొదలు...

నియంత్రణ రేఖ వెంట దశాబ్దానికిపైగా సాగిన పరస్పర దాడుల అనంతరం... 2003లో ఇరు దేశాలు కాల్పుల విరమణపై ఓ ఒప్పందాన్ని చేసుకున్నాయి. తదనంతరం దాదాపు పదేళ్ల వరకు సరిహద్దు ప్రాంతం బాగానే ఉంది. అక్కడి ప్రజలు పెద్దగా తుపాకుల శబ్దాలు లేకుండా కొంతకాలం ప్రశాంతంగానే జీవించారు. ప్రత్యేకంగా పౌరుల గురించే ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఏ కాల్పుల విరమణలోనైనా ఎక్కువగా బాధపడేది వారే. ఇంకా వారికి తగిన రక్షణా ఉండదు. 2018 మేలో పాకిస్థాన్​ దాడి​ నుంచి తప్పించుకోవడానికి ఆర్నియా సెక్టార్​లోని దాదాపు 76 వేల మందికిపైగా గ్రామస్థులు తమ నివాసాలను వదిలివెళ్లాల్సి వచ్చింది. సరిహద్దుకు ఆవలా ఇవే పరిస్థితులు కనిపించాయి.

2013లోనే మారిన పరిస్థితులు...

నా దృష్టిలో 2013లోనే పరిణామాలన్నీ ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే... కశ్మీర్​వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయడాన్ని, భారత్​కు సన్నిహితంగా మెలిగే నవాజ్​ షరీఫ్​ పాక్​ ఎన్నికల్లో గెలుపొందడాన్ని... అక్కడి సైన్యం జీర్ణించుకోలేకపోయింది. ఇది వారికి అసౌకర్యం కలిగించింది. ఇదే మళ్లీ ఉద్రిక్తతలకు కారణమైందని నా అభిప్రాయం. పాక్​ సైన్యం... కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలను తీవ్రతరం చేసింది. హీరానగర్​, సాంబా, జంగ్లోటేలోని భద్రతా దళాలపై దాడులకు పాల్పడింది.

2014-భారత ఎన్నికలు... సీమాంతర ఉగ్రవాదం పట్ల బలమైన, రాజీలేని వైఖరిని అవలంబించిన ప్రభుత్వాన్ని తీసుకొచ్చాయి. ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగేందుకు కారణమైంది. 2012లో దాదాపు 100గా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు.. 2018లో 2 వేలకుపైగా నమోదయ్యాయంటేనే పరిస్థితులు ఎంతలా మారాయో అర్థం చేసుకోవచ్చు. 2019 మొదటి పది నెలల్లోనే గతేడాది గణాంకాల్ని అధిగమించింది.

ఎదురుకాల్పులకు కారణమేంటో తెలుసా...?

అసలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘిస్తారు...? సమాధానం తెలుసా..? ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశమిచ్చేందుకే...! నియంత్రణ రేఖ వెంట జరిగిన చొరబాటు యత్నాలు దీనిని బలపరుస్తున్నాయి. హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం... 2014-18 మధ్యలో 1,461 మంది ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారని స్పష్టమవుతోంది.

అయితే... ఎదురుకాల్పులకు కారణం చొరబాటు మాత్రమే కాదు. నియంత్రణ రేఖపై ఆధిపత్యం కోసం కూడా ఇరుదేశాలు తమ శత్రుత్వాన్ని బయటపెట్టుకుంటాయి. నైతిక ఆధిపత్యం కోసం ఈ అన్వేషణలో తమ సైనికులకు ఏదైనా జరిగితే ఏ మాత్రం ఉపేక్షించకుండా ఎదురుదాడికి దిగుతాయి. అక్టోబర్​ 20న జరిగిన దాడి ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇద్దరు సైనికుల బలిదానం తర్వాత భారత్​ ప్రతీకారానికి దిగిందనే చెప్పాలి.

'దెబ్బకు దెబ్బ', 'కంటికి కన్ను' లాంటి విధానాలు రెచ్చగొట్టేవిలా అనిపించొచ్చు. కానీ.. రక్షణాత్మక వైఖరి అంతకన్నా నష్టదాయకం. నియంత్రణ రేఖ వెంట మోహరించిన బలగాల స్ఫూర్తి, ధైర్యాన్ని ఈ వైఖరి నెమ్మదిగా దూరం చేస్తుంది.

సమస్యకు పరిష్కారముందా..?

అయితే... ఈ హింస చట్రం నుంచి బయటపడేందుకు ఏదైనా మార్గం ఉందా..? ఇందుకు సమాధానం చెప్పడం చాలా సులభం. కానీ అమలు చేయడమే అంతకు మించిన కష్టం. బంతి పాకిస్థాన్​ సైన్యం కోర్టులో ఉంది. వారు చొరబాట్లపై దృష్టి పెట్టి నియంత్రించగలిగితే, సరిహద్దు వెంబడి హింసాత్మక సంఘటనలు వాటంతట అవే తగ్గుముఖం పడతాయి. అయితే... పాకిస్థాన్​ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై దృష్టి పెట్టే అవకాశమే లేదు. ఆ దిశగా ఆలోచించదు కూడా. ఇంకా వాస్తవాలు మాట్లాడుకుంటే... తమ వైపు నుంచి చొరబాట్లు జరుగుతున్నాయంటేనే దాయాది దేశం అసలు అంగీకరించదు.

భారత్​-పాకిస్థాన్​ సంబంధాలు అత్యంత క్షీణించిన ఈ సందర్భంలో.. సరిహద్దు వెంట ప్రశాంత వాతావరణానికి దారితీసేందుకు అవలంబించాల్సిన చర్యలకు అవకాశమూ తక్కువే.

చివరిగా... సరిహద్దు పరిస్థితుల్లో సమీప భవిష్యత్​లో ఎలాంటి మార్పూ రాదన్నది భయంకర వాస్తవం. ఇంకొంతకాలం తుపాకులు మాత్రమే మాట్లాడతాయి. కనీసం ఇరు దేశాలు మాటల దాడుల్ని తగ్గించాలి. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన, కోల్పోతున్న ఎందరో సైనికులు, సాధారణ పౌరులకు ఇచ్చే గౌరవం ఇదే అవుతుంది.

ఇదీ చూడండి: మరోసారి పాక్​ దుర్నీతి.. కాల్పుల్లో మహిళ మృతి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY 

SHOTLIST:
RUSSIAN POOL – AP CLIENTS ONLY
Sochi - 23 October 2019
1. Russian President Vladimir Putin shaking hands with Egyptian President Abdel Fattah el-Sissi (left)
2. Delegations at table ahead of meeting
3. SOUNDBITE (Arabic) Abdel Fattah el-Sissi, Egyptian President:
++STARTS ON WIDE SHOT / INCLUDES CUTAWAY OF RUSSIAN FOREIGN MINISTER SERGEY LAVROV/ENDS ON PAN++
++TRANSLATION PROVIDED AT SOURCE++
"I'd like to say that we consider Russia as a reliable partner of the African continent. We really hope that Russia will work in Africa in all spheres and sectors, including financing infrastructure facilities, energy sphere, road construction on the African continent."
4. Zoom out of Putin listening
5. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
++STARTS ON SHOT OF EL-SISSI / INCLUDES CUTAWAYS++
"This is a nuclear power plant. This is a (Russian) industrial zone in Egypt. We work quite actively in these areas. We are going to invest 190 million US dollars in the infrastructure development and attract up to seven billion US dollars (of investments). By the way, I've just recently visited our mutual friends in the United Arab Emirates. They have been very interested in our collaborative project and we are going to think in what ways they can join our plans."
6. El-Sisi seated in front of Putin
STORYLINE:
Russian President Vladimir Putin hosted leaders of African nations on Wednesday for the first-ever Russia-Africa summit, reflecting Moscow's new push to expand its clout on the continent.
Putin met with Egyptian President Abdel-Fattah el-Sissi before the two leaders opened an economic meeting with heads of state, top officials and businessmen.
The two-day summit is attended by leaders of 43 of the continent's 54 countries, with the other nations represented by senior officials.
He said Russia is willing to expand trade and offer its technologies to African nations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.