ETV Bharat / bharat

'భారత ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదు?'

సరిహద్దులో యథాతథస్థితిని పునరుద్ధరించడానికి చైనాపై భారత్​ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. ఈ మేరకు ప్రభుత్వం బాధ్యతలను గుర్తుచేస్తూ ట్వీట్​ చేశారు.

Why didn't govt insist on restoration of status quo with China?: Rahul
'భారత ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదు?'
author img

By

Published : Jul 7, 2020, 12:27 PM IST

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శనాస్త్రాలను సంధించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. సరిహద్దులో యథాతథస్థితిని పునరుద్ధరించడానికి చైనాపై భారత ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు. జాతీయ అంశాలు చాలా ముఖ్యమని.. వాటిని రక్షించడం ప్రభుత్వం బాధ్యత అని ట్వీట్​ చేశారు.

  • National interest is paramount. GOI's duty is to protect it.

    Then,
    1. Why has Status Quo Ante not been insisted on?
    2. Why is China allowed to justify the murder of 20 unarmed jawans in our territory?
    3. Why is there no mention of the territorial sovereignty of Galwan valley? pic.twitter.com/tlxhl6IG5B

    — Rahul Gandhi (@RahulGandhi) July 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జాతికి సంబంధించిన విషయాలు చాలా ముఖ్యం. వాటిని రక్షించే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. అలాంటప్పుడు.. చైనాతో యథాతథస్థితిని పునరుద్ధరించడానికి భారత్​ ఎందుకు కృషి చేయలేదు? గల్వాన్​ ఘటనలో 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనా.. తన వైఖరిని సమర్థించుకునే అవకాశం భారత్​ ఎందుకు ఇచ్చింది? గల్వాన్​ లోయ సార్వభౌమాధికారాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు ఎందుకు?"

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

చైనాతో సరిహద్దు వివాదంపై గత కొంత కాలంగా భాజపా- కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భాజపా వైఖరిలో లోపాలున్నాయంటూ అనేకమార్లు ఆరోపణలు చేశారు రాహుల్​.

అయితే కాంగ్రెస్​ సీనియర్​ నేతపై భాజపా శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. రక్షణ విభాగానికి సంబంధించిన పార్లమెంట్​ స్థాయీ సంఘం సమావేశానికి రాహుల్​ ఒక్కసారి కూడా ఎందుకు హాజరు కాలేదని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవలే ప్రశ్నించారు.

ఇదీ చూడండి:- డోభాల్​ చాకచక్యంతోనే చైనా వెనక్కు తగ్గిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.