మధ్యప్రదేశ్ సత్నా జిల్లా ముకుంద్‌పూర్ రేవా అటవీ ప్రాంతం ప్రపంచంలోని ఏకైక తెల్లపులుల సఫారీ. ఈ సఫారీకి వెళ్లేందుకు పర్యటకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. మిగతా సఫారీలతో పోలిస్తే ముకుంద్పూర్ను ప్రత్యేకంగా నిలిపేవి ఈ తెల్లపులులే. రహదారి పక్కనే తెల్ల పులులను దగ్గరగా చూడటం పర్యటకులకు సరదాగా అనిపిస్తుంది.
1951లో తెల్ల పులుల సంరక్షణకు రేవా మహారాజు మార్తాండ్ సింగ్ శ్రీకారం చుట్టారు. వేటలో భాగంగా దొరికిన ఓ తెల్ల పులి పిల్ల కోసం గోవింద్గఢ్లో 'బాగ్మహల్'ను ప్రారంభించారు. ఆ పులికి 'మోహన్' అని పేరు పెట్టారు. ప్రపంచంలో ప్రస్తుతమున్న తెల్ల పులులన్నీ మోహన్ వారసులే. మార్తాండ్ సింగ్ కృషితోనే తెల్లపులుల మనుగడ సాధ్యమైంది.
అదే స్ఫూర్తితో ముకుంద్‌పూర్‌లో తెల్లపులుల సంరక్షణ కేంద్రాన్ని 'మోహన్' పేరుతో ఏర్పాటు చేశారు. వైట్ టైగర్ సఫారీలో వింధ్య, రఘు అనే రెండు తెల్లపులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో ఉన్న తెల్ల పులులన్నింటికి తల్లి వింధ్య.