మిషన్ గగనయాన్లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వ్యోమగామి శిక్షణకు నిఖిల్ రథ్ ఎంపికయ్యారు.
చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత మానవ సహిత యాత్ర గగనయాన్‌కు శ్రీకారం చుట్టనుంది భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో). ఈ ప్రయోగానికి ప్రభుత్వం 10 వేల కోట్లు వెచ్చించనుందని స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ 2018లోనే ప్రకటించారు.
2022లో పయనమయ్యే ఈ గగన యాత్రకు వ్యోమగాములను సిద్ధం చేసేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగానే శిక్షణ ఇచ్చేందుకు టెస్ట్ పైలట్లను ఎంపిక చేసింది. మొదటి దశలో 25 పైలట్లను పరీక్షించగా ఒడిశాకు చెందిన నిఖిల్ రథ్ మాత్రమే శిక్షణకు ఎంపికయ్యారు.
అశోక్ రథ్, కుసుమ్ రథ్‌ల తనయుడు నిఖిల్ రథ్. భారత వాయుదళంలో వింగ్ కమాండర్‌గా విధులు నిర్వర్తించి ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లేందుకు శిక్షణ పొందే అరుదైన అవకాశం సాధించారు.
ఇదీ చూడండి:'విక్రమ్'కు ఏం కాలేదు.. ఆశలు సజీవమే: ఇస్రో