ETV Bharat / bharat

ప్లాస్టిక్​ వ్యర్థాలతో నిర్మించిన పొదరిల్లు - plastics for change bangalore

పేరుకుపోతున్న చెత్తతో ప్లాస్టిక్​ వ్యర్థాలు మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వాటిని పునర్వినియోగంలోకి తీసుకొచ్చింది బెంగళూరు 'ప్లాస్టిక్​ ఫర్​ ఛేంజ్​ ఇండియా ఫౌండేషన్'. వేరువేరు చోట్ల నుంచి సేకరించిన ప్లాస్టిక్​తో అందమైన పొదరింటిని నిర్మించారు.

House-made of plastic waste in Mangalore: First trial in the state
ప్లాస్టిక్​ వ్యర్థాలతో నిర్మించిన పొదరిల్లు
author img

By

Published : Nov 12, 2020, 9:06 AM IST

'అందుగలదని ఇందులేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలదు' అన్నట్లు తయారైంది ప్లాస్టిక్​. పర్యావరణాన్ని కలుషితం చేస్తూ.. మానవ మనుగడకే ప్రమాదంలోకి నెడుతోంది. ఈ క్రమంలో ఇలాంటి వాటికి చెక్​ పెట్టాలనే చిన్ని ప్రయత్నంతో విజయం సాధించింది బెంగళూరు 'ప్లాస్టిక్​ ఫర్​ ఛేంజ్​ ఇండియా ఫౌండేషన్'. ఆ స్వచ్ఛంద సంస్థకు చెందిన సభ్యులు.. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటి ద్వారా ఓ అందమైన పొదరిల్లును నిర్మించారు. మంగళూరులో ఉన్న ఈ గృహం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

ప్లాస్టిక్​ వ్యర్థాలతో నిర్మించిన పొదరిల్లు

పది రోజుల్లోనే..

చెత్త సేకరించే వారి నుంచి ప్లాస్టిక్​ను సమీకరించారు ఫౌండేషన్​ సభ్యులు. వాటిని కరిగించి రేకులుగా మార్చారు. ఇందుకుకోసం 1,500 కిలోల ప్లాస్టిక్​ను ఉపయోగించారు. వీటితోనే హాల్​, బెడ్​ రూమ్​, కిచెన్​, బాత్రూమ్​లను రూపొందించారు. ఈ ఇంటి పూర్తిస్థాయి నిర్మాణానికి 4.5 లక్షలు ఖర్చైందని చెప్పుకొచ్చారు ఫౌండేషన్​ సభ్యులు. చూడ చక్కనైన ఈ నిర్మాణానికి పది రోజులే పట్టడం విశేషం.

పునాదులు పటిష్ఠంగా..

ఏ ఇంటి నిర్మాణానికి అయినా ముఖ్యమైనవి పునాదులు. అందుకే ఈ ఇంటి నిర్మాణం విషయంలో కూడా జాగ్రత్త తీసుకున్నారు పునాదిరాళ్లను సిమెంటుతో తయారు చేశారు. ప్లాస్టిక్ ప్యానెళ్లు మరింత దృఢంగా ఉండేందుకు.. వాటికి ఇనుప రాడ్లతో వెల్డింగ్ చేయించారట. ఈ ఇంటికి 30ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు ఫౌండేషన్​ సభ్యులు. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలడం దీని ప్రత్యేకత.

చెత్త సేకరించే వారి నుంచి ప్లాస్టిక్​ను సమీకరిస్తాం. ఇలా సేకరించిన మొత్తాన్ని హైదరాబాద్​లోని బ్యాబూ హౌస్​ వారు రీసైక్లింగ్​ కోసం గుజరాత్​కు పంపుతారు. రీసైక్లింగ్​ అయిన తరువాత ప్లాస్టిక్​ ప్యానెల్​లు నిర్మాణానికి అనుకూలంగా వస్తాయి. వీటికి ఎలాంటి వాసనా ఉండదు. పైగా చాలా కాలం మన్నిక వస్తాయి.

- చందన్, ప్లాస్టిక్ ఫర్ చేంజ్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్

ఫౌండేషన్​ ధాతృత్వం

ఇలా ప్లాస్టిక్​తో నిర్మించిన ఇంటిని కమలా అనే ఓ వృద్ధురాలికి ఉచితంగా ఇచ్చారు ఫౌండేషన్​ సభ్యులు. వచ్చే ఏడాది జనవరిలోగా వ్యర్థాలను సేకరించే 20కుటుంబాలకు ప్లాస్టిక్​ గృహాలను బహుమతిగా ఇవ్వాలని సంకల్పించుకున్నారు.

నా ఇల్లు రెండుసార్లు కూలిపోయింది. ప్లాస్టిక్ ఫర్ చేంజ్ ఇండియా ఫౌండేషన్ వాళ్లు నాకు అందమైన ఇంటిని నిర్మించి ఇచ్చారు. తొలుత వారు ప్లాస్టిక్​తో ఇల్లు ఎలా నిర్మిస్తారోనని ఆశ్చర్యపోయాను. అచ్చం ఇటుక, సిమెంట్​తో చేపట్టిన నిర్మాణంలాగే ఈ ఇల్లూ ఉంది.

- కమలా, లబ్ధిదారు

ఇదీ చూడండి: అవగాహన, జీవనోపాధి కల్పించే 'ప్యాడ్ ఉమెన్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.