ETV Bharat / bharat

మీ సూపర్​ హీరో కోసం ఏం సిద్ధం చేస్తున్నారు? - fathers day on june 21 in telugu

నాన్న.. నడిపించే నాయకుడు. మనసులో వాత్సల్యం, బయటకు కాఠిన్యం. వారసుల ఉన్నతి తప్ప మరేదీ ఆశించని సౌమ్యుడు. క్షమించే నైజం, సర్దుకుపోయేతత్వం అతడిలోనే ఉంటుంది. కంటికి రెప్పలా.. ఎండకు నీడలా.. వానకు గొడుగులా.. ఆకలికి బువ్వలా.. దాహానికి నీరులా.. చేనుకు కంచెలా.. ఇలా ఎన్ని విధాలుగా పోల్చినా నాన్న విలువ పెరుగుతుందే తప్ప కొలతలకు అందేది కాదు. మరి అలాంటి వ్యక్తి కోసం ఓ రోజు కేటాయించారు. అదే అంతర్జాతీయ పితృ దినోత్సవం(ఫాదర్స్​ డే). ఏ రోజు ఆ పండగ చేసుకుంటారు? చూద్దామా..

fathers day on june 21
మీ సూపర్​హీరో కోసం ఏం సిద్ధం చేస్తున్నారు?
author img

By

Published : Jun 16, 2020, 6:32 PM IST

అమ్మ నవ మాసాలు మోసి జన్మనిస్తే.. బతుకంతా ధారపోసి జీవితాన్నిచ్చేది నాన్న. స్వార్థంలేని ప్రేమతో గుండెలపై ఆడించి.. బతుకు దారి చూపే మార్గదర్శి. కష్టాల్లో నిబ్బరంగా, ఆపదలో ధైర్యంగా ఉండేలా తీర్చిదిద్దేది తండ్రే. కన్నబిడ్డ ఎదుగుదలకు అహోరహం శ్రమించే శ్రమజీవి. అందుకే బిడ్డ ఎంత ఎత్తుకెదిగినా అంతకంటే పైమెట్టులోనే ఉంటాడు నాన్న. అతని త్యాగం, ఓర్పు వెలకట్టలేనివి. ఆయన రుణం తీర్చలేనిదని బిడ్డలు చెబుతారు. అందుకే ఆయన ప్రేమకు, సేవలను స్మరించుకునేందుకు ఓ రోజును కేటాయించారు. అదే అంతర్జాతీయ పితృదినోత్సవం.

ఆదివారమే...

జూన్ మూడో ఆదివారం ఈ పండుగను ప్రపంచమంతా నిర్వహించుకుంటుంది. 1910లో తొలిసారి ఫాదర్స్​ డే జరుపుకొన్నట్లు తెలుస్తోంది. 1972 నుంచి ఆ రోజును అధికారికంగా నాన్న కోసమే కేటాయించారు. మరి ఈ ఆదివారమే (జూన్​ 21) ఆ పండుగ వస్తోంది కాబట్టి మీరంతా మీ హీరోకు కానుకలు సిద్ధం చేసుకోండి.

ఇలా చేయండి..

నాన్నంటే పిలుపు కాదు.. ఎమోషన్‌. పిల్లల కోసం కంటికి కనిపించని శత్రువుతో బయటకి కనబడని యుద్ధం చేస్తాడు నాన్న. బిడ్డను అమ్మ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కానీ నాన్న ప్రపంచమంటే ఏంటో తెలియజేస్తాడు. ప్రతి మనిషి జీవితంలో అంత ముఖ్య పాత్ర పోషిస్తున్న నాన్న గురించి కొంతమంది ఎక్కువగా బయటపెట్టుకోలేరు. దానికి కారణం ఆయన కాస్త గంభీరంగా ఉండటం. అందుకే నాన్నా నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పడానికి కాస్త సంకోచిస్తుంటారు. కానీ ప్రస్తుతం సాంకేతికంగా ఉన్న అవకాశాలను ఒడిసిపట్టండి. లాక్​డౌన్​లో బయటకు వెళ్లేందుకు, పార్కులు, సినిమాలు చూసే అవకాశం లేదు కాబట్టి నాన్నతో ఓరోజు కేటాయించండి.

ఆయనకు చెప్పాలనుకున్న విషయాలు, భావాలను చిన్నపాటి వీడియో రూపంలో చూపించండి. పాతకాలం నాటి ఫొటోలతో ఓ ఆల్బమ్​ మీరే రూపొందించి బహుమతిగా ఇవ్వండి. చిన్న కవిత రాయడం, లేదంటే అందమైన బొమ్మ గీసి రంగు కాగితంలో చుట్టి ఇవ్వండి చాలు. కనీసం మీ నాన్న మీద ఉన్న ప్రేమను పాట రూపంలోనైనా చెప్పండి. ఏది ఏమైనా కరోనా కాలంలో ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి.. మీరు చెప్పాలనుకున్న మాటలు, భావలు మీ సూపర్​హీరోతో పంచేసుకోండి. దాని కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు వేసుకోండి. ఎందుకంటే సమయం లేదు మిత్రమా.. జూన్​ 21నే ఆ దినోత్సవం మరి.

ఇదీ చూడండి: '83' బయోపిక్​: తండ్రుల పాత్రల్లో తనయులు నటిస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.