కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సందేహాల నివృత్తి కోసం కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌లో "మై గవర్నమెంట్ హెల్ప్‌డెస్క్"పోర్టల్‌ను తీసుకొచ్చింది. కొవిడ్-19పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతున్నందున.. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి వాట్సాప్ నెంబర్ కేటాయించింది. వ్యాధి లక్షణాలు, జాగ్రత్తలు, సామాజిక బాధ్యత లాంటి పలు రకాల ప్రశ్నలకు వాట్సాప్ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు.
జియో హాప్టిక్ వారు కేంద్ర ఆరోగ్యశాఖ వారికి ఈ టెక్నాలజీని తయారు చేసి ఇచ్చారు. ఇది ఏఐ ప్లాట్ ఫామ్ మీద పనిచేస్తుంది. భారత్‌దేశంలో వాట్సాప్‌ని సుమారు 40 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. ఈ హెల్ప్‌డెస్క్ నెంబర్ ద్వారా ప్రశ్నలు సందిస్తే కేంద్ర ఆరోగ్య శాఖతో అనుసంధానమైన చాట్‌బోట్ మనకు సమాధానాలు తెలియజేస్తుంది.
ఇదీ చూడండి:కరోనాతో జామియా వద్ద సీఏఏ వ్యతిరేక నిరసనలకు బ్రేక్