ETV Bharat / bharat

'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'

కశ్మీర్ అంశంలో పాకిస్థాన్​ కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్రాలు మొదట ప్రయోగించరాదన్నది ప్రస్తుతం దేశ విధానంగా ఉందన్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరగనుంది అనేది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు.

author img

By

Published : Aug 16, 2019, 5:23 PM IST

Updated : Sep 27, 2019, 5:04 AM IST

'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'

అణ్వస్త్రాల వినియోగం అనేది భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. అణ్వస్త్రాలు మొదట ప్రయోగించరాదన్నది ప్రస్తుతం దేశ విధానంగా ఉందని తెలిపారు. కశ్మీర్ అంశంలో దాయాది దేశం కయ్యానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో ఘాటుగా స్పందించారు సింగ్​.

రాజ్​నాథ్​ సింగ్​

"భారతదేశ అణు విధానం విషయానికి వస్తే తొలుత అణ్వస్త్రాలు ప్రయోగించరాదన్నది ప్రస్తుతం దేశ విధానంగా ఉంది. భవిష్యత్తులో ఏం జరగనుంది అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. "

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

అటల్​ బిహారీ వాజ్​పేయీ తొలి వర్ధంతి సందర్భంగా .. 1998లో తొలిసారి అణు పరీక్షలు నిర్వహించిన పోఖ్రాన్​ ప్రాంతాన్ని సందర్శించారు రక్షణ మంత్రి. అటల్​ జీకి నివాళులర్పించారు. భారత్​ను అణుశక్తిగా మార్చాలన్న అటల్​ జీ సంకల్పానికి పోఖ్రాన్​ ప్రాంతం నిదర్శనమని పేర్కొన్నారు. భారత్​ అణ్వస్త్రాలు కలిగిన దేశం హోదా పొందటం ప్రతి పౌరునికి గర్వకారణమన్నారు. అటల్​ జీకి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​పై పిటిషన్లు సరిగాలేవంటూ సుప్రీం ఆగ్రహం

Intro:Body:

o

Conclusion:
Last Updated : Sep 27, 2019, 5:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.