బంగాల్ భాజపా అధ్యక్షుడికి శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రెండురోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయనకు శుక్రవారం కొవిడ్ పరీక్ష నిర్వహించారు.
"ఘోష్‌కు ప్రస్తుతం 102డిగ్రీల జ్వరం ఉంది. ఆయన ఆక్సిజన్ స్థాయిలు నిలకడగానే ఉన్నాయి. భయపడాల్సిన అవసరంలేదు" అని ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు.