ETV Bharat / bharat

'సాగు చట్టాల్ని సమర్థించే వాళ్లు ఆ చిట్కాలు చెప్పాలి' - farmers protest against new farm laws

సాగు చట్టాలకు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన పలు రైతు సంఘాలను స్వయంగా కలుస్తామని చెప్పారు భారతీయ కిసాన్​ యూనియన్​ అధికార ప్రతినిధి రాకేశ్​ టికైత్​. కొత్త చట్టాలతో వారికి ఎలా ప్రయోజనం చేకూరుతుందో, వాళ్లు పంటను విక్రయించేందుకు ఉపయోగించే సాంకేతికత ఏంటో తాము కూడా తెలుసుకుంటామన్నారు.

We'll go & meet those farmers' groups who're supporting the Centre on 3 Farm laws
'సాగు చట్టాలకు మద్దతిస్తున్న రైతు సంఘాలను కలుస్తాం'
author img

By

Published : Dec 21, 2020, 3:18 PM IST

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు మద్దతిస్తున్న రైతు సంఘాలను నేరుగా వెళ్లి కలుస్తామని భారతీయ కిసాన్​ యూనియన్​ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్ తెలిపారు. కొత్త చట్టాలతో వారు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో స్వయంగా అడిగి తెలుసుకుంటామన్నారు. పంటను విక్రయించేందుకు ఉపయోగిస్తున్న సాంకేతికతను వారి నుంచే నేర్చుకుంటామని చెప్పారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో వివిధ రైతు సంఘాలు నాలుగు వారాలుగా ఆందోళనలు చేస్తున్నాయి. అయితే హింద్​ మజ్దూర్ కిసాన్​ సమితి వంటి పలు సంఘాలు మాత్రం కొత్త సాగు చట్టాలకు మద్దతు ప్రకటించాయి. ఇవి రైతులకు ఉపయోగకరమని చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే రాకేశ్ టికైత్​ వారిని కలుస్తామన్నారు.

ఇదీ చూడండి: పంజాబ్ యువ​ రైతు ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.