ETV Bharat / bharat

కరోనాతో పెళ్లికొడుకు మృతి- 100 మంది అతిథులకు వైరస్

బిహార్​ పట్నాలోని పాలీగంజ్​లో జరిగిన ఓ వివాహ వేడుక కరోనా వైరస్​కు భారీ క్లస్టర్​గా మారింది. వివాహమైన రెండు రోజులకే పెళ్లికొడుకు కరోనాతో మృతి చెందాడు. వివాహ వేడుకకు హాజరైన 100 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది.

Wedding ceremony
కరోనాతో పెళ్లికొడుకు మృతి
author img

By

Published : Jul 1, 2020, 11:14 AM IST

Updated : Jul 1, 2020, 11:35 AM IST

బిహార్​ పట్నా జిల్లాలో 15 రోజుల క్రితం జరిగిన ఓ పెళ్లి.. కరోనాకు కేంద్ర బిందువుగా మారింది. పెళ్లైన రెండు రోజులకే తీవ్ర జ్వరంతో పెళ్లికొడుకు మరణించగా.. అతనికి కరోనా నిర్ధరణ పరీక్ష చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే ఈ వేడుక బిహార్​లో అతిపెద్ద వైరస్ గొలుసుగా మారిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని పాలీగంజ్​లో సుమారు 100 మందికిపైగా కరోనా పాజిటివ్​ వచ్చిందని తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్​ ద్వారా దాదాపు 350 మందిని పరీక్షించామన్నారు.

లక్షణాలు కనిపించినా..

పెళ్లికొడుకు గురుగ్రామ్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేసేవాడు. మే చివరి వారంలో పెళ్లి కోసం స్వగ్రామానికి చేరుకున్నాడు. 'తిలక్​' అనే వేడుక తర్వాత అతనిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అతనికి తీవ్రంగా జ్వరం ఉన్నా పారాసెటిమాల్​ వేసుకుని జూన్​ 15న వివాహ తంతు జరిపించారు.

అతని ఆరోగ్య పరిస్థితి విషమించటం వల్ల జూన్​ 17న పట్నా ఎయిమ్స్​కు తరలించగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో అతనికి ఎలాంటి నిర్ధరణ పరీక్షలు చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం అధికారులకు తెలియటంతో అతని సమీప బంధువులకు కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్​గా తేలింది.

మరో 86 మందికి..

ఈ నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి విస్తృతంగా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 364 మందిని పరీక్షించగా 86 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. వీరిలో చాలామందికి ఎలాంటి లక్షణాలు లేకపోవటం గమనార్హం. ఆ 15 మంది నుంచే వీరికి సోకినట్లు భావిస్తున్నారు. అందరినీ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు.

వివాహ వేడుకల్లో 50 మందికి మించి పాల్గొనకూడదన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు.. వీరు తిలోదకాలు ఇచ్చారు. ఈ వేడుకలో ఎక్కువ సంఖ్యలో అతిథులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పాలీగంజ్​ బజార్​ను సీజ్​ చేసిన అధికారులు క్రిమిసంహారక మందులతో శుద్ధి చేశారు.

Last Updated : Jul 1, 2020, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.