పార్లమెంట్‌పై దాడి జరిగి నేటితో 19ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆనాటి దుర్ఘటనను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్‌పై దాడిని ఎప్పటికీ మరువలేమన్నారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.
-
We will never forget the cowardly attack on our Parliament on this day in 2001. We recall the valour and sacrifice of those who lost their lives protecting our Parliament. India will always be thankful to them.
— Narendra Modi (@narendramodi) December 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We will never forget the cowardly attack on our Parliament on this day in 2001. We recall the valour and sacrifice of those who lost their lives protecting our Parliament. India will always be thankful to them.
— Narendra Modi (@narendramodi) December 13, 2020We will never forget the cowardly attack on our Parliament on this day in 2001. We recall the valour and sacrifice of those who lost their lives protecting our Parliament. India will always be thankful to them.
— Narendra Modi (@narendramodi) December 13, 2020
" 2001లో ఇదే రోజు పార్లమెంట్‌పై జరిగిన దాడిని ఎన్నటికీ మరువలేం. ఈ దుశ్చర్యలో పార్లమెంట్‌ను కాపాడేందుకు ప్రాణాలు అర్పించిన వారి త్యాగం, శౌర్యాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి భారత్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
అమరులకు నా సెల్యూట్: రాజ్‌నాథ్
పార్లమెంట్‌పై దాడిలో అమరులైన వీరులకు నివాళులర్పించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. వారి ధైర్యసాహసాలను భవిష్యత్తు తరాలు సైతం కీర్తిస్తాయని ట్వీట్ చేశారు. పార్లమెంట్‌ను కాపాడేందుకు తమ ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బంది శౌర్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు.
2001 డిసెంబర్ 13న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంట్‌పై దాడి చేశారు. వారిని భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు దిల్లీ పోలీసులు, ఒక సీఆర్పీఎఫ్ మహిళతో పాటు ఇద్దరు పార్లమెంట్ భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి సహా మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు.
ఇదీ చూడండి: అన్నదాతకే ఆకలి తీర్చిన చిన్నారి