ఐరాసలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. చేసిన వ్యాఖ్యలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తిప్పికొట్టింది. 'ప్రపంచమంతా భారతదేశాన్ని, ఆర్ఎస్ఎస్ను ఒక్కటిగా చూడాలని కోరుకున్నామని, ఆ పనిని ఇమ్రాన్ చేశారని' పేర్కొంది.
ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నందునే తమను లక్ష్యంగా చేసుకొని ఇమ్రాన్‌ఖాన్... ఐరాసలో విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఆర్ఎస్ఎస్. 'ఇమ్రాన్ ఆర్ఎస్ఎస్ పేరును వ్యాప్తి చేయడం ముగించారు. కానీ ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపకూడదని కోరుకుంటున్నాం' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
"ఆర్ఎస్ఎస్ భారతదేశంలో మాత్రమే ఉంది. ఇది భారత్ కోసమే పనిచేస్తోంది. ప్రపంచంలో మరెక్కడా దీని శాఖలు లేవు. మరి పాకిస్థాన్ మనపై ఎందుకు కోపంగా ఉంది? సంఘ్‌పై కోపంగా ఉండటం అంటే అది భారతదేశంపై కోపంగా ఉండటమే. ఇప్పుడు భారత్, ఆర్ఎస్ఎస్ పర్యాయపదాలుగా ఉన్నాయి."
- కృష్ణగోపాల్, ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి
ఉగ్రవాదానికి బలైన వారు, బాధితులు... ఆర్ఎస్ఎస్ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకమని ఇప్పుడు తెలుసుకున్నారని కృష్ణగోపాల్ వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్-ముగ్గురు ముష్కరులు హతం