ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని నరేంంద్ర మోదీ.. సీఏఏ, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య అంశాలను ప్రస్తావించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వేగంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
"సీఏఏ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాం. దేశ అవసరం కోసమే వీటిని తీసుకొచ్చాం. మాపై ఒత్తిడి ఉన్నప్పటికీ మా నిర్ణయాలపై పునరాలోచించం."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి