ETV Bharat / bharat

అనుకున్నట్లే జరిగింది.. విమాన ప్రమాదానికి కారణం అదే!

author img

By

Published : Aug 8, 2020, 12:45 PM IST

కోజికోడ్​ విమాన ప్రమాద ఘటనను తాము ముందే ఊహించామని వైమానిక రంగ నిపుణులు తెలిపారు. విమానాశ్రయం కొండలపై ఉండటం, ఇరువైపులా లోయలు, లైటింగ్​ తక్కువగా ఉండటం వంటివి ప్రమాదానికి ప్రధాన కారణాలని వారు పేర్కొన్నారు.

KHOZIKODE FLIGHT ACCIDENT
భయపడినట్లే జరిగింది..

కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదాన్ని గతంలోనే ఊహించామని వైమానిక రంగ నిపుణులు వెల్లడించారు. ఈ విమానాశ్రయం కొండలపై ఉందని, రన్‌వేకు ఇరువైపులా లోయలున్నాయని వారు గుర్తుచేశారు. దీనికి తోడు లైటింగ్‌ కూడా ఎక్కువగా ఉండదని చెప్పారు. ఈ విషయమై గతంలోనే తాము అనేకసార్లు సంబంధిత అధికార వర్గాలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.

అదే జరిగివుంటే.?

విమానం రన్‌వే చివరకు వెళ్లి రెండు ముక్కలుగా విడిపోయింది. అయితే అదృష్టవశాత్తు మంటలు రాలేదు. ఒక వేళ మంటలు ఏర్పడివుంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువగా ఉండేది. 2010లో మంగళూరు విమానాశ్రయంలో ఇదే తరహా ప్రమాదం జరగ్గా మంటలు రావడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. విమానాలు రన్‌వేలపై దిగే సమయంలో టైర్లలోని కొన్ని రబ్బరు శకలాలు కిందపడుతుంటాయి. వర్షంతో ఇవి రన్‌వేను మరింత జారుడుగా మారుస్తాయి. కోజికోడ్‌ విమానాశ్రయంలో భారీ వర్షంతో రన్‌వే మరింత జారుడుగా మారింది. దీనితో పాటు రన్‌వే ఏటవాలుగా ఉండటం వల్ల విమానం జారిపోయివుండవచ్చని విమానయాన నిపుణులు అభిప్రాయపడ్డారు.

మలబార్‌ ప్రజలకు సౌకర్యంగా..

రాష్ట్రంలో తిరువనంతపురం, కొచి, కొలికోడ్‌, కన్నూర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. ఒక రాష్ట్రంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలున్న రాష్ట్రం కేరళ ఒక్కటే. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాన్ని మలబార్‌గా వ్యవహరిస్తారు. పోర్చుగీస్‌ యాత్రికుడు వాస్కోడిగామా తొలిసారిగా కోజికోడ్‌లోని కప్పాడ్‌ బీచ్‌లో 1498లో అడుగుపెట్టాడు.

ఉత్తర జిల్లాలైన కాసర్‌గోడ్‌, వయనాడ్‌, కోజికోడ్‌, కన్నూర్‌, మల్లపురం జిల్లాలకు ఈ విమానాశ్రయం సౌకర్యంగా ఉంటుంది. గల్ఫ్‌లో ఉంటున్న ఈ ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది ప్రవాస భారతీయులకు సేవలందిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం కన్నూర్‌లో కొత్త విమానాశ్రయం నిర్మించినందున ఇక్కడ రద్దీ తగ్గింది.

ఇదీ చదవండి: కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.