అసోం సరిహద్దు జిల్లాల్లోని 20 శాతం పేర్ల పునర్విచారణపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు అనుమతిస్తే జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను తమ రాష్ట్రంలో అమలు చేయనవసరంలేదని అసోం ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హిమంత బిస్వా శర్మా స్పష్టం చేశారు. సరిహద్దు జిల్లాల పునర్విచారణలో తప్పులు దొర్లే అవకాశం ఉందని శర్మ పేర్కొన్నారు.
దేశ వ్యాప్త ఎన్ఆర్సీ ప్రతిపాదనపై తమ ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని మోదీ చెప్పడం వల్ల.. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకుంటున్నట్టు శర్మ వివరించారు. విచారణకు సుప్రీంకోర్టు నిరాకరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.