ETV Bharat / bharat

'సరిహద్దులో సమస్య పరిష్కారానికి శాంతియుత సంప్రదింపులు' - Boarder problem issues

సరిహద్దులో చెలరేగిన వివాదాన్ని పరిష్కరించేందుకు చైనాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత్‌ ప్రకటించింది. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరిస్తామని విదేశాంగశాఖ తెలిపింది. మధ్యవర్తిత్వానికి ట్రంప్​ ప్రతిపాదించిన నేపథ్యంలో భారత్​ ఈ వ్యాఖ్యలు చేసింది.

We are engaged with China to resolve border row: India on Trump's offer to mediate
సరిహద్దు వివాద పరిష్కారంలో శాంతియుత సంప్రదింపులు
author img

By

Published : May 28, 2020, 9:44 PM IST

భారత్​-చైనా మధ్య నెలకొన్న సమస్యను వేగంగా పరిష్కరించే విధంగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమంటూ ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తాజాగా ట్రంప్​ ప్రతిపాదనపై స్పందించింది భారత్. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు చైనాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. లద్ధాఖ్​లో భారత్‌-చైనా సైనిక దళాలు బాహాబాహీకి దిగిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: చైనాపై అమెరికా త్రిశూల వ్యూహం.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.