ETV Bharat / bharat

గల్వాన్​ వద్ద భారత బలగాలకు వాటర్​ప్రూఫ్ దుస్తులు! - భారత్ చైనా సరిహద్దు వివాదం

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్వాన్​ లోయలో భారత బలగాలు ప్రత్యేకమైన వాటర్​ప్రూఫ్ దుస్తులను సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా గల్వాన్​ నదిలో దిగేందుకు వీలుగా వీటి అవసరం చాలా ఉందని సైనిక వర్గాలు అంటున్నాయి.

galwan india
భారత బలగాలు
author img

By

Published : Jul 1, 2020, 12:23 PM IST

గల్వాన్​ నదిలో నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ప్రత్యేకమైన వాటర్​ప్రూఫ్​ దుస్తులు సమకూర్చుకోవాలని భద్రతాబలగాలు భావిస్తున్నాయి. ఓవైపు చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో వీటి అవసరం ఉందని సైనిక వర్గాలు చెబుతున్నాయి.

గల్వాన్​ లోయలో భారత గస్తీ పాయింట్​- 14 సమీపంలో చైనా బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే చైనా బలగాలు వాటర్​ప్రూఫ్​ దుస్తులతో సంసిద్ధంగా ఉన్నాయి. ఈ దుస్తుల ద్వారా వాళ్లకు ఉష్ణోగ్రతతో కరిగిన మంచు నీటిలో విధులు నిర్వహించడానికి వీలవుతుందని తెలుస్తోంది. ఈ దుస్తుల వల్లనే జూన్​ 15న జరిగిన ఘర్షణలో అల్పోష్ణస్థితి మరణాలను తగ్గించిందని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ ఇబ్బందులు తొలగించేందుకు..

అక్సాయిచిన్​లో పుట్టే గల్వాన్​ నది వాస్తవాధీన రేఖ వెంబడి ప్రవహించి గస్తీ పాయింట్​(పీపీ)- 14 వద్ద షాయోక్ నదిలో కలుస్తుంది. అంతకుముందు కేఎం-120 పోస్ట్ నుంచి పీపీ- 14 వరకు గస్తీ నిర్వహించే సమయంలో భారత బలగాలను నీటిలో దిగాల్సి వస్తుంది. ఫలితంగా దుస్తులతో పాటు బూట్లు తడిస్తాయని ఓ అధికారి చెప్పారు.

లద్దాఖ్​ సెక్టార్ నుంచి అరుణాచల్​ప్రదేశ్ వరకు ఎల్​ఏసీ వెంబడి సైన్యాన్ని భారీగా మోహరించింది చైనా. ఓ వైపు భారత్​తో సైనిక చర్చలు జరుపుతూనే ఇలా దూకుడుగా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా స్థావరాలకు ఎదురుగా భారత్​ కూడా దీటుగా బలగాలను మోహరించేందుకు సిద్ధమవుతోంది.

ఇదీ చూడండి: డ్రాగన్‌తో ఢీ అంటే 'టీ'.. యుద్ధ ట్యాంకర్లు మోహరించిన భారత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.