కరోనాకు ముందులా కేసుల వాదనలు న్యాయస్థానంలో ప్రత్యక్షంగా ఆలకించాలనే తమకూ ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. అయితే ఈ విషయంలో వైద్యాధికారుల అభిప్రాయాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. వారి నివేదిక పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ట్రయల్ కోర్టులలో భౌతిక వాదనలు రోజు మార్చి రోజు చేపట్టాలని ఇటీవలే దిల్లీ హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా న్యాయవాదులు సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ సందర్భంగా ఓ న్యాయవది సుప్రీంలో భౌతిక వాదనలు ఎప్పుడు ప్రారంభస్తారని అడగ్గా.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది.
వర్చువల్గా కేసుల విచారణ జరపడం వల్ల సామాన్యులకు న్యాయం జరగడం లేదని ఓ న్యాయవాది అన్నారు. దీనిని తోసిపుచ్చిన అత్యున్నత ధర్మాసనం ప్రతి పౌరునికి కోర్టును అశ్రయించే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేసింది.