రామమందిర శంకుస్థాపన మహోత్సవంతో.. శతాబ్దాల నిరీక్షణకు తెరపడిందని, అయోధ్యలో సువర్ణ అధ్యయనాన్ని భారత దేశం సృష్టించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఎన్నో ఏళ్లు టెంటులో ఉన్న రాముడికి.. దేశం అత్యద్భుతమైన ఆలయాన్ని నిర్మించనుందని పేర్కొన్నారు.
అయోధ్యలో రామమందిర భూమిపూజలో పాల్గొన్న మోదీ.. అనేక మంది ప్రాణ త్యాగలకు ఫలితమే ఈ ఆలయ నిర్మాణమని వెల్లడించారు. వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం మహద్భాగ్యమని వెల్లడించారు. ఇంతటి అదృష్టాన్ని రామమందిర ట్రస్టు తనకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:- పునాది రాయితో పులకించిన అయోధ్య
భావి తరాలకు స్ఫూర్తి..
రాముడు ప్రతి చోటా ఉన్నాడని, రాముడు అందరివాడని తెలిపిన ప్రధాని.. భారత సంప్రదాయానికి రామాలయం ప్రతీకగా నిలుస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలతో పాటు యావత్ మానవజాతికే ఈ ఆలయం గొప్ప స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.
రామమందిర నిర్మాణానికి ప్రేమ, సోదర భావంతో ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. మనిషి రాముడిని అనుసరించినప్పుడల్లా.. అభివృద్ధి జరిగిందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
స్టాంపులు విడుదల...
'శ్రీరామ జన్మభూము మందిరం' పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఇవీ చూడండి:-