కర్ణాటకలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మొత్తం 109 తాలుకాల్లోని 2,709 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. 20,728 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు అధికారులు. వైరస్ రోగులు ఓటేసేందుకు చివరి గంట సమయం కేటాయించారు.
మొత్తం 39వేల 378 స్థానాల్లో 1లక్షా 5వేల 431 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో 3,697 పంచాయతీల అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ నెల 22న 117 తాలూకాలలో 3,019 పంచాయతీలకు తొలి దశలో ఓటింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డిసెంబర్ 30న జరగనుంది.
ఇదీ చదవండి: అసోం పర్యటనలో షా.. కామాఖ్యా ఆలయ సందర్శన