ETV Bharat / bharat

హరియాణా ఎన్నికల పోలింగ్​ షురూ.. కదిలిన ఓటర్లు

author img

By

Published : Oct 21, 2019, 7:37 AM IST

Updated : Oct 21, 2019, 8:12 AM IST

హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్​ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు, రాజకీయ ప్రముఖులు పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఇప్పటికే పోలింగ్​ కేంద్రాల వద్ద జన సందడి మొదలయింది. 90 స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కోటీ 83 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.

హరియాణా ఎన్నికల పోలింగ్​ షురూ

​హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరగుతున్నాయి. 1,169 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 105 మంది మహిళలున్నారు. 85 లక్షల మంది మహిళలతో సహా మొత్తం కోటీ 83 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

హరియాణా అసెంబ్లీ పోరు వివరాలు

నియోజకవర్గాలు : 90

అభ్యర్థులు : 1,169

ఓటర్లు : 1,83,00000

పోలింగ్​ కేంద్రాలు : 19,578

భద్రతా సిబ్బంది : 75,000

వీవీప్యాట్ యంత్రాలు: 27,611

భారీ భద్రత...

పోలింగ్‌ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. సుమారు 75 వేల మంది పోలీసులు, 130 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.

నువ్వా-నేనా...

90 శాసనసభ స్థానాలున్న హరియాణాలో భాజపా, కాంగ్రెస్​తో పాటు ఐఎన్​ఎల్​డీ, జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ), హరియాణా జన్‌హిత్‌ కాంగ్రెస్‌ (హెచ్​జేసీ), ఆమ్ ఆద్మీ పార్టీ , బహుజన్ సమాజ్ పార్టీ, స్వరాజ్ ఇండియా తదితర చిన్నపార్టీలూ పోటీ పడుతున్నాయి. అయితే ప్రధానంగా భాజపా-కాంగ్రెస్, జేజేపీ​ మధ్యనే పోరు నడిచే అవకాశం ఉంది. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాషాయ పార్టీ పట్టుదలగా ఉంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్​ విశ్వప్రయత్నాలు చేసింది.ప్రముఖుల పోరు...ప్రస్తుత ముఖ్యమంత్రి, భాజపా నేత మనోహర్‌లాల్ ఖట్టర్ కర్నాల్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ సీఎం, సీఎల్పీ నేత భూపీందర్ సింగ్ హుడా గర్హీ సంప్లా- కిలోయ్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కాంగ్రెస్ నుంచి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, జేజేపీ నుంచి దుష్యంత్ చౌతాలా, ఐఎన్​ఎల్​డీ నుంచి అభయ్ సింగ్ చౌతాలా తదితర ప్రముఖులు పోటీలో నిలిచారు.హరియాణా శాసనసభ ఎన్నికల సమరంలో భాజపా ముగ్గురు క్రీడాకారులను బరిలోకి దింపింది. దాద్రి నియోజకవర్గం నుంచి రెజ్లర్ బబితా ఫొగాట్, సోనిపట్‌లోని బరోడా నుంచి యోగేశ్వర్ దత్, పెహోవా నుంచి హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్‌ను బరిలో నిలిపింది.

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Monday, 21 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1903: US Box Office Content has significant restrictions, see script for details 4235808
'Maleficent: Mistress of Evil' claims No. 1 over 'Joker'
AP-APTN-1804: US CA Pumpkin Fest AP Clients Only 4235801
Highlights from Half Moon Bay Arts and Pumpkin Festival featuring more than 2,000 pound gourd
AP-APTN-1724: ARCHIVE Jennifer Lawrence AP Clients Only 4235794
Jennifer Lawrence marries art dealer Cooke Maroney
AP-APTN-1605: ARCHIVE Chris Evans AP Clients Only 4235786
'Captain America' Chris Evans helps dedicate youth theater
AP-APTN-1348: Egypt Coffins AP Clients Only 4235740
Ancient coffins discovered in Luxor
AP-APTN-1111: Pakistan UK Royals AP Clients Only 4235753
William and Kate visit Children's Village in Lahore
AP-APTN-1020: Australia Long Flight Content has significant restrictions, see script for details 4235739
Qantas completes non-stop New York to Sydney flight
AP-APTN-1020: Cuba Alonso Wake AP Clients Only 4235742
Hundreds honour Cuban ballerina Alicia Alonso
AP-APTN-1020: Peru Sea Lions AP Clients Only 4235741
Peru nonprofit returns 6 sea lions to ocean
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 21, 2019, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.