ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిల్హౌర్ ప్రాంతంలో ఓ వోల్వో బస్సు కారును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ రహదారిపై.. బిల్హౌర్లోని మకన్పుర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు సహా బస్సు డ్రైవర్ మృతి చెందాడు.
ఇదీ చూడండి: 'ఆర్థిక ఒత్తిళ్ల' సంచితో భారత్ పర్యటనకు ట్రంప్..!