దేశ ప్రగతిని గురించి ప్రణాళికలు, చట్టసభలో సవాళ్లు, అధికారులకు ఆదేశాలు, దేశ పురోగతి గురించిన సమీక్షలు, విదేశీ పర్యటనలు ఇలా రోజూవారి షెడ్యూల్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో బిజీ. ప్రధాని బాధ్యతల్లో ఉన్నవారు పనిలో ఆనందం వెతుక్కుంటూ సాగిపోతుంటారేమో అనిపిస్తుంది. ఇలా బిజీబిజీగా గడిపే ప్రధాని మోదీ ఓ చిన్నారితో ఆడుకోవడం ఆశ్చర్యమే మరి. పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో చిన్నారిని ఎత్తుకుని లాలించారు ప్రధాని.
"ఓ ప్రత్యేక అతిథి నన్ను కలవడానికి ఈ రోజు పార్లమెంట్‌కు వచ్చారు" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ప్రధాని. వెంటనే.. కామెంట్లు వెల్లువెత్తాయి. ఆ చిన్నారి ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కాసేపటికే ఈ చిత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ప్రధాని వద్దకు వచ్చిన ఈ బుల్లి అతిథి... భాజపా ఎంపీ సత్యనారాయణ జతియా మనుమరాలని తర్వాత తెలిసింది.
ఇదీ చూడండి: బలపరీక్ష జరుగుతుందని సుప్రీం ఆశాభావం