ETV Bharat / bharat

'భారత్​లో మత, సామాజిక స్థితి ప్రాతిపదికన మైనారిటీలపై హింస'

author img

By

Published : Mar 12, 2020, 6:38 AM IST

భారత్​లో మైనారిటీలపై జరుగుతున్న హింసపై అమెరికా అధికారిక నివేదికను విడుదల చేసింది. మత, సామాజిక స్థితి ప్రాతిపదికన ఈ హింసాకాండలు జరగుతున్నట్లు పేర్కొంది.

Violence and discrimination targeting minorities among significant human rights issues: US report
'భారత్​లో మత, సామాజిక స్థితి ప్రాతిపదికన మైనారిటీలపై హింస'

మత, సామాజిక స్థితి ప్రాతిపదికన భారత్​లో మైనారిటీలపై హింస, వివక్ష సహా మానవహక్కుల సమస్యలు చోటు చేసుకుంటున్నట్లు అమెరికా తెలిపింది. బుధవారం విడుదల చేసిన అధికారిక నివేదికలో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది.

అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో విడుదల చేసిన ఈ నివేదిక.. భారత్​లో హత్యలు, ఖైదీలపై అధికారుల చిత్రహింసలు, ఏకపక్ష అరెస్టులు, జైళ్లలో అధ్వాన్న పరిస్థితులు కొనసాగుతున్నట్లు పేర్కొంది. జమ్ముకశ్మీర్​, ఈశాన్య భారత్​, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర నేరాలు, మానవహక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.