శ్రీరాముడు లంకలోకి చేరుకునేందుకు రామసేతు నిర్మాణంలో వానరాలు కీలకపాత్ర పోషించాయని చెబుతుంటారు. కానీ ఒడిశా సంబల్పుర్ పరిధిలోని హుమా గ్రామంలో అందుకు విరుద్ధంగా జరిగింది. నది మధ్యలోని చిన్న ద్వీపంలో చిక్కుకున్న కోతులను కాపాడేందుకు గ్రామస్థులు నాటు పడవలతో వంతెన నిర్మించారు.
హుమా గ్రామంలో 'కాళీమాత' ఆలయం మహానది మధ్యలోని ప్రదేశంలో ఉంది. కొద్ది రోజుల క్రితం అక్కడకు సుమారు 30 కోతులు చేరుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహానది ఉప్పొంగింది. వానరాలు ఆలయం సమీపంలోనే చిక్కుకుపోయాయి. ఆహారం దొరికే పరిస్థితులు లేవు.
గ్రామస్థులు.. నదిలోని బండరాళ్ల మధ్యలో నాటు పడవలను ఉంచి వంతెన ఏర్పాటు చేశారు. వాటిపై నుంచి నది ఒడ్డుకు చేరుకున్న వానరాలు బతుకుజీవుడా అంటూ వెళ్లిపోయాయి.
ఇదీ చూడండి: గుజరాత్ వరదలు: కాలనీల్లో మకర విహారం!