ETV Bharat / bharat

ప్రాణం నిలవాలంటే 18 కి.మీ. నడవాల్సిందే! - నిండు గర్భిణిని 18 కి.మీ. మోసుకెళ్లిన గ్రామస్థులు

సరైన రవాణా వసతులు లేక ఓ నిండు గర్భిణిని 18 కిలో మీటర్లు భుజాలపై మోసుకెళ్లిన ఘటన హిమాచల్​ ప్రదేశ్​లో జరిగింది. ​గత 45 రోజుల్లో ఇలాంటి ఘటన నాల్గవది కావటం విశేషం.

Villagers carry pregnant woman on chair for 18 km
నిండు గర్భిణిని 18 కి.మీ. మోసుకెళ్లిన గ్రామస్థులు
author img

By

Published : Feb 18, 2020, 5:40 PM IST

Updated : Mar 1, 2020, 6:07 PM IST

ప్రాణం నిలవాలంటే 18 కి.మీ. నడవాల్సిందే!

హిమాచల్​ ప్రదేశ్​ సైంజ్​ లోయలోని శక్తి గ్రామంలో అమానుష ఘటన జరిగింది. ఓ నిండు గర్భిణిని 18 కిలోమీటర్ల దూరం ఆసుపత్రికి మోసుకొని వెళ్లారు గ్రామస్థులు. సరైన రవాణా మార్గాలు, వైద్య సదుపాయం లేనందున ఆమెను రెండు కర్రల మధ్యలో కుర్చీని ఏర్పాటు చేసి భుజాలపై తీసుకెళ్లారు. ఇక్కడ ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయని వాపోతున్నారు గ్రామస్థులు. గత 45 రోజుల్లో నలుగురిని ఇలాగే తీసుకెళ్లినట్లు తెలిపారు.

తమ దయనీయ స్థితి గురించి అధికారులకు మొరపెట్టుకుంటున్నప్పటికీ స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:నమస్తే ట్రంప్​: అహ్మదాబాద్​లో ఎటు చూసినా ఆ బొమ్మలే

Last Updated : Mar 1, 2020, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.