ETV Bharat / bharat

శవాన్ని మూడు కిలోమీటర్లు మోసుకెళ్లారు.. ఇదే కారణం? - మూడు కిలోమీటర్లు దూరం

అనారోగ్యంతో చనిపోయిన ఓ మహిళ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మూడు కిలోమీటర్లలో ఉన్న ఇంటికి మోసుకెళ్లిన ఘటన కర్ణాటక చిక్కమగలూరులో జరిగింది. రోడ్డు సౌకర్యం లేకనే ఇలా చేయాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు.

village people tied the dead body to the wooden pole
శవాన్ని మూడు కిలోమీటర్లు మోసుకెళ్లారు.. ఇదే కారణం?
author img

By

Published : Jun 3, 2020, 1:05 PM IST

కర్ణాటక చిక్కమగలూరు జిల్లా ముడిగెరే తాలూకా కలసా సమీపంలోని మనుకుబ్రీ గ్రామంలో హృదయవిదారకమైన సంఘటన జరిగింది. అనారోగ్యంతో చనిపోయిన ఓ మహిళ మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామానికి మోసుకొని వెళ్లారు స్థానికులు

ఇదీ జరిగింది...

మనుకుబ్రీ గ్రామానికి చెందిన యాభై ఏళ్ల శారదమ్మ వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. గ్రామస్థులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే గ్రామానికి రోడ్డు సౌకర్యం మార్గం లేదు. అడవి మార్గంలోనే నడుచుకుంటూ వెళ్లాలి. దీంతో మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న ఆసుపత్రికి ఆమెను రెండు కర్రల సాయంతో భుజాలపై మోసుకొని తీసుకెళ్లారు స్థానికులు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని అలాగే మోసుకుంటూ గ్రామానికి తీసుకొని వచ్చారు.

ఈ దృశ్యాలను స్థానికుడు తన సెల్​ఫోన్​లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అవుతోంది. సరైన రోడ్డు మార్గం లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని, ఈ దృశ్యాలు చూసిన తర్వాత అయిన ప్రజా ప్రతినిధులు స్పందిస్తారేమోనని వీడియో తీసిన వ్యక్తి ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి:మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.