ETV Bharat / bharat

విచారణకు 'అప్పగింత'పై మాల్యా అప్పీలు - కోర్టు విచారణ

భారత్​కు అప్పగించాలన్న బ్రిటన్​ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించారు విజయ్ మాల్యా. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.

మాల్యాకు అప్పీలు అవకాశంపై విచారణ మంగళవారం
author img

By

Published : Jul 1, 2019, 10:37 PM IST

స్వదేశీ బ్యాంకుల్లో రూ. 9వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్​మాల్యాను భారత్​కు అప్పగించే అంశం కీలక మలుపు తిరిగింది. భారత్​కు అప్పగించాలన్న కోర్టు తీర్పు మేరకు సంబంధిత దస్త్రంపై బ్రిటన్ ప్రభుత్వం సంతకం చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లండన్ హైకోర్టులో విజయ్​మాల్యా చేసిన అప్పీలు మంగళవారం విచారణకు రానుంది.

లిఖితపూర్వకంగా అప్పీలు చేసేందుకు ఇప్పటికే మాల్యా అనుమతి కోల్పోయారు. ఈ నేపథ్యంలో మౌఖికంగా అప్పీల్​కు అనుమతి కావాలని కోరారు మాల్యా.
అప్పీలు​ చేసుకునేందుకు అనుమతి సాధించనట్లయితే 28 రోజుల్లోగా మాల్యాను భారత్​కు అప్పగించవలసి ఉంటుంది. అప్పీలుకు అనుమతి వస్తే యూకే హైకోర్టులో వాదనలు కొనసాగుతాయి.

భారత్​కు రాకుండా ఉండేందుకు మాల్యాకు మరో అవకాశం ఉంది. ఐరోపా మానవ హక్కుల కోర్టును ఆశ్రయించవచ్చు. భారత్​కు అప్పగిస్తే తనకు అపాయం జరుగుతుందని, హింసిస్తారని నిరూపించగలిగితే మాల్యా అప్పగింతకు వ్యతిరేకంగా ఐరోపా మానవ హక్కుల కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: మధ్య దిల్లీలో ఆలయం ధ్వంసంతో ఉద్రిక్తత

Intro:Body:

o

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.