ETV Bharat / bharat

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై నివేదిక సిద్ధం

వీవీప్యాట్‌ స్లి ప్పులను లెక్కించాలి. ఇది విపక్షాల డిమాండ్‌. లెక్కించటం కుదరదు. ఇది ఎన్నికల సంఘం వాదన. నమూనా లెక్కింపు ఎంత ఉండాలన్న దానిపై నివేదికను భారత గణాంక సంస్థ(ఐఎస్‌ఐ) ఈసీకి నివేదిక సమర్పించింది.

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై నివేదిక సిద్ధం
author img

By

Published : Mar 23, 2019, 4:30 AM IST

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ఎంత ఉండాలన్న దానిపై భారత గణాంక సంస్థ(ఐఎస్‌ఐ) శుక్రవారం ఎన్నికల సంఘానికి నివేదికను అందజేసింది. దీనిని పరిశీలించిన అనంతరం ఈసీ అంతిమ నిర్ణయం తీసుకోనుంది. ఈ నివేదికను ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను ఈవీఎంలతో పాటు పోల్చి చూడాలని గతంలో వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనితో నమూనా పరిమాణంపై నివేదికను ఇవ్వాలని అప్పటి ఈసీ ఛైర్మన్‌ ఓపీ రావత్‌ ఐఎస్‌ఐని కోరారు.

ట్యాంపరింగ్‌ అనుమానాలతోనే వీవీప్యాట్‌ల రాక..

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాన్ని ట్యాంపరింగ్‌ చేయొచ్చని వివిధ పక్షాలు గతంలో అనుమానాలు వ్యక్తం చేశాయి. వీటిని తొలగించటానికి, ఎన్నికల విశ్వసనీయతను పెంపొందించటానికి వీవీప్యాట్‌లను తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. వీవీప్యాట్‌లను తీసుకొచ్చినప్పటికీ.. వాటిలో స్లిప్పుల లెక్కింపుపై అనిశ్చితి నెలకొంది. మానవ వనరుల కొరత దృష్ట్యా రాజకీయ పక్షాలు కోరిన మేర లెక్కింపు సాధ్యం కాదని ఈసీ అప్పుడే తేల్చిచెప్పింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.