ETV Bharat / bharat

ఆపత్కాలంలో వెంటిలేటర్లు ఊపిరి పోస్తాయి.. కానీ!

వైద్య పరిభాషలో చెప్పాలంటే వెంటిలేటర్‌ ఒక మహత్తర సంజీవని. మరణం అంచులదాకా వెళ్లిన మనిషి... వీటి సాయంతోనే మళ్లీ బతికి బట్టకడుతున్నాడు. వెంటిలేటర్‌ వల్ల ప్రాణాలు పోకుండా ఆగుతున్నాయి సరే... వాటి ప్రభావం రోగిపై ఏ మేరకు ఉంటుంది? కరోనా కాలంలో విస్తృతంగా వాడుతున్న వెంటిలేటర్లతో ఏమైనా సమస్యలు వస్తాయా? తెలుసుకుందాం.

VENTILATOR
వెంటిలేటర్లు
author img

By

Published : Apr 28, 2020, 7:52 AM IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెంటిలేటర్లకు విపరీతంగా డిమాండు పెరిగింది. వైరస్‌ ఊపిరితిత్తుల్లో తిష్ఠ వేసి, రోగికి శ్వాస ఆడకుండా చేస్తున్నప్పుడు ప్రాణాల్ని కాపాడాలంటే వెంటిలేటర్‌తో కృత్రిమ శ్వాసను అందించాల్సిందే. కరోనా రోగులకు వెంటిలేటర్లను ఇబ్బడి ముబ్బడిగా వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చర్చనీయాంశాలయ్యాయి.

బతికే అవకాశాలు ఉంటాయా?

వెంటిలేటర్‌ దాకా వెళ్లిన వారు బతికే అవకాశాలు చాలా తక్కువని పలు అధ్యయనాలు తేల్చాయి. మూడింట రెండొంతుల మంది చనిపోతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ బతికినా ఆ తర్వాత ఏడాదిలోపు కొందరు చనిపోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.

వెంటిలేటర్‌మీద ఎక్కువ రోజులు ఉండటం, ఆసుపత్రిలో చేరడానికన్నా ముందే ఇతర వ్యాధులు సోకిన చరిత్ర ఉంటే.. మరణావకాశాలు ఇంకొంత పెరుగుతాయనేది వారి విశ్లేషణ.

సమస్యలు ఎలా వస్తాయి?

ఊపిరితిత్తులతో వెంటిలేటర్‌ను అనుసంధానించిన గొట్టాల ద్వారా ఒక్కోసారి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి కొత్త ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఊపిరితిత్తుల్లో పేరుకున్న వ్యర్థాలు దగ్గు ద్వారా బయటకు వెళ్లే ప్రక్రియ... వెంటిలేటర్‌ గొట్టాలు గొంతులో ఉండటం వల్ల సరిగా సాగదు. ఫలితంగా వ్యర్థాలు ఎక్కువగా చేరిపోయి ఇన్ఫెక్షన్‌ తప్పకపోవచ్చు.

ఈ సమస్యను వెంటిలేటర్‌ వల్ల వచ్చే న్యుమోనియా అని వైద్యులు భావిస్తారు. ఇది తలెత్తితే అప్పటికే అటాఇటా అన్నట్లు ఉన్న రోగి ఆరోగ్యం మరింత విషమిస్తుంది. పైగా వైద్య చికిత్సలు చేయడం క్లిష్టతరంగా మారుతుంది. అప్పటికే ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగికి వెంటిలేటర్‌తో మరో ఇన్ఫెక్షన్‌ తలెత్తితే దానిని ‘సూపర్‌ ఇన్ఫెక్షన్‌’గా వ్యవహరిస్తారు.

ఇలా దెబ్బతినొచ్చు...

రోగి ఊపిరితిత్తుల్లోకి వెంటిలేటర్‌ గొట్టాలను పంపే క్రమంలో వైద్య సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వెంటిలేటర్‌ రకం, గాలిని పంపే వేగం, ఒత్తిడి తదితరాలను దృష్టిలో పెట్టుకోవాలి. అవసరానికి మించి ఆక్సిజన్‌ను పంపితే ఊపిరితిత్తులు పాడయ్యే ప్రమాదం లేకపోలేదు.

కరోనా వైరస్‌ కారణంగా అప్పటికే బలహీనంగా మారిన ఊపిరితిత్తుల్లోకి మరీ ఒత్తిడితో గాలిని పంపిస్తే వాటి కణజాలం దెబ్బతింటుంది. కృత్రిమ శ్వాస ద్వారా ఒకవేళ రోగి శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్‌ అందకపోతే ఆ ప్రభావం కండరాలు సహా ఇతర అవయవాలపై పడుతుంది.

చదవడమూ... రాయడమూ..

వెంటిలేటర్‌ వైద్య చికిత్సల తర్వాత... కొందరిలో చిత్రమైన సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సరిగ్గా చదవలేక, రాయలేక, స్పష్టంగా ఆలోచించలేక పోవడం, నిద్ర పట్టకపోవడం, ఆందోళన పెరగడం, భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం... వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి చిన్నచిన్న సమస్యలు దీర్ఘకాలంలో తగ్గిపోతుంటాయని, కొందరిలో మొండికేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.

  • వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు శారీరక కదలికలు చాలా తక్కువవుతాయి. ఈ కారణంగా చర్మ సమస్యలు వస్తాయి. కొందరిలో రక్త సరఫరా సరిగా సాగదు కనుక కండరాలు బలహీనమవుతాయి.
  • రోగి నుంచి వెంటిలేటర్‌ గొట్టాలను తొలగించేటప్పుడు కొన్ని సందర్భాల్లో స్వరపేటిక, తంత్రులు దెబ్బతింటాయి. ఫలితంగా కొద్దిరోజుల పాటు మాటల్లో తేడా వస్తుంది.

అసలెందుకిది...

శరీరానికి ప్రాణవాయువు అందించాల్సిన ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని క్షీణించినప్పుడు వెంటిలేటర్‌లోని యాంత్రిక వ్యవస్థ ద్వారా ఒత్తిడితో గొట్టాలతో వైద్యులు కృత్రిమ శ్వాసను అందిస్తారు. తద్వారా శరీరంలోని రక్త కణాలకు సరిపడా ఆక్సిజన్‌ అందేలా, అదే సమయంలో కార్బన్‌డైఆక్సైడ్‌ను బయటకు పంపేలా చూస్తారు.

ఎలా అమర్చుతారు...

రోగి నోటి ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ ఓ పైపును ఊపిరితిత్తుల్లోకి పంపుతారు. దీనిని వెంటిలేటర్‌తో అనుసంధానిస్తారు. దీనిని ఇంట్యుబేషన్‌ అంటారు. ఆ పైపు ద్వారా కృత్రిమంగా శ్వాసను అందిస్తారు. రోగికి అందించే ఆక్సిజన్‌ స్థాయులను తరచూ వైద్యులు మార్చాల్సి వస్తుంది.

రకరకాల సమస్యలు

కొడిగట్టే ప్రాణాల్ని వెంటిలేటర్‌ పట్టి నిలుపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదని ఒహాయో(అమెరికా)లోని క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ అత్యవసర విభాగం అధిపతి డాక్టర్‌ హసన్‌ ఖౌలీ చెప్పారు. ఇదే సమయంలో కరోనా సోకి, వెంటిలేటర్‌పైకి వెళ్లి... అదృష్టవశాత్తూ ప్రాణాలు నిలుపుకొన్నవారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యేందుకు చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు.

శారీరకంగా బలహీనం..

వెంటిలేటర్‌ను తొలగించాక కొందరు శారీరకంగా అత్యంత బలహీనులు అవుతారని, రోజువారీ కార్యక్రమాలైన స్నానం చేయడం, గడ్డం చేసుకోవడం, భోజనం చేయడం... వంటి వాటికీ ఇతరులపై ఆధారపడే పరిస్థితి తలెత్తుతుందని, చాలా రోజులుగా మంచాన ఉండటమే ఇందుకు కారణమని హసన్‌ ఖౌలీ విశ్లేషించారు.

జ్ఞాపక శక్తి క్షీణత..

వెంటిలేటర్‌పై వైద్య చికిత్సలు పొందిన వారిలో కొందరు కోలుకొనే క్రమంలో నడవడం, మాట్లాడటం, ఆహారాన్ని మింగడం లాంటి వాటినీ మళ్లీ నేర్చుకోవాల్సి రావచ్చునని సోమర్‌సెట్స్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ మెడికల్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ రోడ్రిక్స్‌ చెప్పారు. కొందరిలో జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని, లెక్కల్ని సరిగా చేయలేరని, అక్కౌంటెంట్ల వంటి వారు తిరిగి తమ వృత్తిని కొనసాగించడం కష్టం కావొచ్చునని ఆయన చెప్పారు. కొందరు వాహనాలను నడపలేరని, పచారీ దుకాణాల్లో కొనుగోళ్లనూ సమర్థంగా చేయలేరని, అంతకు ముందులాగా చలాకీగా పరుగెత్తలేక పోతున్న వారూ కనిపిస్తున్నారని ఆయన వివరించారు.

ఇదీ చూడండి: కంటిని కాపాడుకునేందుకు 'ట్వంటీ-ట్వంటీ' రూల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.