ఒడిశా స్టీల్ సిటీగా పేరుగాంచిన రూర్కెలాలో కూరగాయల వ్యాపారం చేసే కార్తీక్ కమీలాకు షాక్ ఇచ్చారు జీఎస్టీ అధికారులు. రూ.110 కోట్ల పన్నును ఎగవేసిననట్లు అందులో ఉండడం చూసి విస్తుపోయాడు కార్తీక్.
తానో సాధారణ మధ్యతరగతి మనిషినని, తనకు కూరగాయలు అమ్మడం తప్ప మరో వ్యాపారం లేదని కార్తీక్ వాపోయాడు. అధికారులు అందజేసిన నోటీసుల ప్రకారం కోయెల్‌నగర్‌లోని లింగరాజ్ ట్రేడింగ్ సంస్థలో ఉండే మార్కెట్ కాంప్లెక్స్‌కు తనకు ఏవిధమైన సంబంధం లేదని బాధితుడు పేర్కొన్నారు.