ETV Bharat / bharat

వసుంధర రాజె, దుష్యంత్​ సింగ్​కు కరోనా నెగిటివ్​ - corona virus news

భాజపా సీనియర్​ నాయకురాలు వసుంధర రాజె, ఆమె కుమారుడు దుష్యంత్​ సింగ్​కు కరోనా పరీక్షల్లో ​నెగిటివ్​గా తేలింది. వైరస్ సోకిన బాలీవుడ్​ గాయని కనికా కపూర్​ వెళ్లిన కార్యక్రమానికి హాజరుకావడం వల్ల స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు వసుంధర. ఫలితాల్లో తనతోపాటు కుమారుడు దుశ్యంత్​కు నెగిటివ్​గా వచ్చినప్పటికీ 15 రోజుల పాటు నిర్బంధంలోనే ఉంటామని వెల్లడించారు.

Vasundhara Raje
భాజపా నేత వసుంధర రాజే
author img

By

Published : Mar 21, 2020, 6:42 PM IST

స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన భాజపా నాయకురాలు, రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్​కు కరోనా వైరస్​ పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. వైరస్​ సోకిన బాలీవుడ్​ గాయని కనికా కపూర్​ హాజరైన కార్యక్రమానికి వెళ్లిన వసుంధర రాజె, దుష్యంత్​ సింగ్​ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ క్రమంలో వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. శనివారం వెలువడిన ఫలితాల్లో తమకు నెగిటివ్​గా తేలినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు భాజపా నేత వసుంధర.

Vasundhara Raje
వసుంధర రాజే ట్వీట్​

" కొవిడ్​-19 పరీక్షల్లో ఫలితాలు వైరస్​ లేదని తేలినట్లు వెల్లడించేందుకు సంతోషిస్తున్నా. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నా కుమారుడు, నేను 15 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోనే ఉంటాం. మీలో చాలా మంది మా గురించి ఆందోళన చెందారు. మా కోసం చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. "

- వసుంధనర రాజె, భాజపా నేత

విందుకు హాజరవటంతో..

కరోనా పాజిటివ్​గా తేలిన బాలీవుడ్​ గాయనీ కనికా కపూర్​ ఇటీవల ఓ విందుకు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి పలువురు పార్లమెంట్​ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వెళ్లారు. అందులో భాజపా నేత వసుంధర రాజె, ఆమె తనయుడు కూడా ఉన్నారు. కనికాకు పాజిటివ్​ అని తేలిన తర్వాత వారిద్దరు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అంతకు ముందు దుష్యంత్​ పార్లమెంట్​ సమావేశాలకు హాజరవడం వల్ల గందరగోళం నెలకొంది.

ఇదీ చూడండి: బాలీవుడ్​ గాయనితో పార్లమెంట్​కు కరోనా సెగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.